BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు

BPNL Recruitment 2025:
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతీ ఒక్కరూ కూడా కలలు కంటారు. ఈ ఉద్యోగాల కోసం ఎందరో కష్టపడుతుంటారు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో చిన్న ఉద్యోగ నోటిఫికేషన్ (Notification) వచ్చినా సరే అప్లై చేస్తుంటారు. అయితే చాలా ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్‌పై మాత్రమే ఉంటాయి. అందులోనూ ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా గ్రాడ్యుయేషన్‌పై ఉంటాయి. అయితే భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు కేవలం గ్రాడ్యుయేషన్ వారే కాకుండా.. పది, ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్, ఆపరేషన్ అసిస్టెంట్ పోస్టుల కోసం మొత్తం 2,152 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. పది, ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా వీటిలో శాశ్వత ఉద్యోగం పొందవచ్చు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న పనులను సక్రమంగా నిర్వహించడానికి అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్, లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్ అసిస్టెంట్ పోస్టులకు భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) పోస్టులకు నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 12లోగా అప్లై చేసుకోవాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bharatiyapashupalan.com లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌కి గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి. లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్ అసిస్టెంట్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. పశువుల పెంపకం పెట్టుబడి అధికారిలో 362 పోస్టులు ఉండగా.. పశువుల పెంపకం పెట్టుబడి సహాయకుడుకి 1,428 పోస్టులు, లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్ అసిస్టెంట్‌కు 362 పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 21 ఉండాలి. గరిష్ట వయస్సు 45 ఏళ్ల వరకు ఉంటుంది. లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు ఫీజు రూ.944, లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్ రూ.826, లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్ అసిస్టెంట్‌కు రూ.708 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా సెలక్ట్ చేస్తారు. లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌కు నెలకు రూ.38,200, లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెంట్ నెలకు రూ.30,500, లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్ అసిస్టెంట్ నెలకు రూ.20,000 జీతం ఇస్తారు.
-
Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెలక్ట్ అయితే నెలకు లక్షకి పైగా జీతం
-
Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్
-
CUET: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ సార్ట్.. ఎలా చేసుకోవాలంటే?
-
Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.69 వేల జీతం
-
TG: మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీలో 14236 పోస్టుల భర్తీకి టీజీ సర్కార్ గ్రీన్ సిగ్నల్