Balochistan: బలూచిస్తాన్‌కు చైనా బలగాలు.. పాకిస్తాన్ చేతులు ఎత్తేసినట్లేనా?
Balochistan: అపారమైన వనరులు ఉన్న ప్రాంతం పాకిస్తాన్(Pakisthan)లోని బలూచిస్తాన్. ఇక్కడి వనరులను పాకిస్తాన్, చైనా తరలించుకుపోతున్నాయి. కానీ బలూచిస్తాన్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.

Balochistan: అపారమైన వనరులు ఉన్న ప్రాంతం పాకిస్తాన్(Pakisthan)లోని బలూచిస్తాన్. ఇక్కడి వనరులను పాకిస్తాన్, చైనా తరలించుకుపోతున్నాయి. కానీ బలూచిస్తాన్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. దీంతో అభివృద్ధి, స్వయంప్రతిపత్తి కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baluchistan Libaration Army) కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో అపారమైన ఖనిజ సంపద ఉంది. విలువైన ఈ సంపదను తరలించుకుపోతునర్న చైనా(China), పాకిస్తాన్.. ఇక్కడ ప్రజల అభివృద్ధి, సమస్యలు, నిరుద్యోగ(Un employeement) సమస్యను మాత్ర పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు, సైనికులు, ఇతర ప్రాంత ప్రజలపై దాడి చేస్తోంది. తాజాగా రైలును హైజాక్ చేసింది. 200 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. పరిస్థితులు క్రమంగా చేయి దాటిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్ చైనా సాయం కోరినట్లు సమాచారం.
చైనా బలగాలు..
చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC)లో భాగంగా బలూచిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవు తదితర ప్రాజెక్టుల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టులను రక్షించేందుకు, తమ పౌరుల భద్రత కోసం చైనా సైనిక సమక్షతను పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 నవంబర్‌లో చైనా తమ సైనికులను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌కు పంపనున్నట్లు ప్రకటించింది, ఇది ఐదేళ్లలో మొదటి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసం కావచ్చని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి స్థానిక విమోచన సంస్థలు CPEC ప్రాజెక్టులను, చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు చైనా పెట్టుబడులకు ముప్పుగా మారడంతో, గ్వాదర్ వంటి ప్రాంతాల్లో చైనా తన సైనిక ఉనికిని పెంచే అవకాశం గురించి ఊహాగానాలు ఉన్నాయి.
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్వాదర్ ఓడరేవు(Gwadar Ship yard) వ్యూహాత్మకంగా కీలకమైనది కావడంతో, చైనా దానిని సైనిక స్థావరంగా కూడా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుందని అనుమానాలు ఉన్నాయి. ఇది భారతదేశంతో సరిహద్దు వివాదాల్లో చైనాకు పైచేయి సాధించడంలో, అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వంటి ముఖ్యమైన సముద్ర మార్గాలను నియంత్రించడంలో సహాయపడవచ్చు. అయితే, ఇది పూర్తిగా అమలులోకి వచ్చిందని లేదా చైనా బలగాలు శాశ్వతంగా బలూచిస్తాన్‌లో మోహరించాయని ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు.
చైనా జోక్యంపై ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. బలూచ్ ప్రజలు చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు CPECతమ వనరుల దోపిడీగా భావిస్తూ, చైనా–పాకిస్తాన్ సహకారాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చైనా సైనిక బలగాలు వస్తే బలూచ్ విమోచన ఉద్యమాల నుంచి మరింత ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.