China: ఈ కంపెనీ ఎంప్లాయిస్ పెళ్లి చేసుకోకపోతే.. ఉద్యోగం గోవిందా.. ఎక్కడంటే?

China:
సాధారణంగా ఆఫీస్‌లో వర్క్ చేయకపోయినా, సరైన సమయానికి వెళ్లకపోయినా, సంస్థకు లాభాలు లేకపోతే కొందరిని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. కానీ చైనాలోని ఓ కంపెనీలో ఓ వింత కారణం మీద ఉద్యోగంలో నుంచి తీసేస్తామని చెప్పిన ఘటన చోటుచేసుకుంది. చైనాకి చెందిన ఓ సంస్థ పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ప్రకటించింది. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని అధికారులతో పాటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ వచ్చే సెప్టెంబర్‌లోగా పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 28 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పెళ్లి కాని వారు, విడాకులు తీసుకున్న వారు పెళ్లి చేసుకోవాలని తెలిపింది.
పెళ్లి కాని వారంత కూడా మార్చికి ఒక లెటర్ సమర్పించాలని తెలిపింది. జూన్ వరకు చూసి ఆ తర్వాత సెప్టెంబర్‌కి కూడా పెళ్లి చేసుకోకపోతే వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అయితే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. పెళ్లి చేసుకోవడం వల్ల జనాభా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోకపోవడం అనేది అనైతికమన పెళ్లి్ళ్లకు సహకరించమని తెలిపింది. కంపెనీ పెట్టిన ఈ రూల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.
కంపెనీ ఇలా ప్రకటించగా స్థానిక మనవ వనరులు, సామాజిక భద్రతా శాఖ ఇటీవల కంపెనీని తనిఖీ చేశారు. అయితే కంపెనీ ఎవరిని కూడా పెళ్లి కారణంగా ఉద్యోగంలో నుంచి తొలగించలేదని తెలిపింది. అయితే ఇలా పెళ్లి చేసుకోవడం లేదనే కారణంతో ఉద్యోగంలో నుంచి తీసేయడం రాజ్యంగా విరుద్ధమని కొందరు అంటున్నారు. చైనాలో జనాభా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వింతైన ఐడియాలను చైనా కంపెనీలు బాగా తీసుకొస్తుంటాయి. డేటింగ్, పెళ్లి ఇలా వివిధ రకాల కొత్త కొత్త ఐడియాలను తీసుకొస్తుంది. దీంతో జనాభా పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంది.
-
Pig Liver To Human: వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. మానవునికి పంది కాలేయం
-
BYD Car: ఎలక్ట్రిక్ కారు సంచలనం.. 5 నిమిషాల్లో 470 కి.మీ.అన్ని కార్లకు చెక్
-
Business: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. ఈ వ్యాపారాలు చేస్తే కోటీశ్వరులు మీరే
-
Virus: చైనాలో పుట్టిన కరోనాలాంటి మరో వైరస్.. వామ్మో ఇది ఇంత ప్రమాదమా?
-
Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల బోనస్.. ఛాన్స్ కొట్టేశారుగా..