Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?

Yuzvendra Chahal:
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ఈ మధ్య ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీతో చాహల్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోగా.. విడిపోతారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ధనశ్రీతో చాహల్ విడిపోయిన తర్వాత సింగిల్‌గానే ఉన్నట్లు అందూ భావించారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓ మిస్టరీ గర్ల్‌తో కలిసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ ఓ అందమైన అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయితో చాహల్ కాస్త సన్నిహితంగానే ఉన్నాడు. వీరిద్దరి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరు? చాహల్ సింగిల్ కాదు ఏమో? ఈ కారణంగానే ధన శ్రీ, చాహల్ విడిపోయారు ఏమోనని ఇలా ఎన్నో సందేహాలు ఫ్యాన్స్ మదిలో ఉన్నాయి. మ్యాచ్ సమయంలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెతో కలిసి కాస్త సన్నిహితంగా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?
Damn son ! Chahal is a proper aashiq. Flexing a new girl at the first opportunity after divorce. 😭😭 pic.twitter.com/DNxtRSvgzC
— Gotta Get Kat (@katiebuoy) March 9, 2025
ఇటీవల ధన శ్రీ వర్మతో విడాకులు తీసుకున్న చాహల్ ఇప్పుడు కొత్త అమ్మాయితో కనిపించడంతో రిలేషన్‌లో ఉన్నారు ఏమోనని వార్తలు వినిపిస్తున్నాయి. ధన శ్రీతో విడాకులు తీసుకున్న తర్వాత జనవరిలో ఓ అమ్మాయితే చాహల్ కనిపించాడు. కానీ అప్పుడు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఈ అమ్మాయితో కనిపించాడు. టీమిండియాను సపోర్ట్ చేస్తూ స్టాండ్స్‌లో కూర్చోని కనిపించాడు. వీరిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నట్లు ఉన్నారు. కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అయితే ఈ అమ్మాయి ఆర్‌జే మహ్వాష్ అని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఈమె రేడియో జాకీ. రేడియో, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా బాగా పాపులర్ సాధించింది. ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె రేడియో జాకీగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత దేశపు మొట్టమొదటి మహిళా ప్రాంక్‌స్టర్‌గా మారింది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. మరి ఈ అమ్మాయితో చాహల్ డేటింగ్‌లో ఉన్నాడో లేకపోతే స్నేహితులరాలో అనే విషయంపై క్లారిటీ రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి.
ఇదిలా ఉండగా చాహల్, ధన శ్రీ వర్మ ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. వ్యక్తగత కారణాల వల్ల ఈ ఏడాది విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారని, ధన శ్రీ వేరే వాళ్లతో డేటింగ్ ఉందని విడిపోయినట్లు భావించారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్