Yevade Subramanyam: పదేళ్ల తర్వాత నాని మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Yevade Subramanyam:
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ కాగా.. ఇప్పుడు మరో మూవీ కూడా రీ రిలీజ్‌కు సిద్ధం కాబోతుంది. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన నాని ఎవడే సుబ్రమణ్యం సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమనాలో నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. పదేళ్ల తర్వాత ఈ సినిమా మార్చి 21వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వైజయంతీ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఈ సినిమా అప్పుడు మంచి హిట్ అయ్యింది. చాలా మందికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నాగ్ అశ్విన్‍కు కూడా మంచి ఫేమ్ తీసుకొచ్చింది. దీని తర్వాత మహానటి, కల్కి 2898 ఏడీ తీసి పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. అయితే ఎవడే సుబ్రమణ్యం సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో సుబ్బు అలియాస్ సుబ్రమణ్యం క్యారెక్టర్‌లో నాని మెరిశారు. అయితే కెరీర్, డబ్బు కోసం ఎక్కువగా ఆరాపడేవాడు. అయితే అసలు జీవితం అంటే ఏంటి? నిజమైన సంతోషం ఏంటని దాని మీద వచ్చేదే ఈ చిత్రం. ఈ సినిమాలో ఎక్కువగా సెల్ఫ్ డిస్కవరీ అంశం ఉంటుంది.
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రిషి పాత్రలో కనిపించాడు. ఇందులో మాళవిక నాయర్, రీతూ వర్మ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ నటి షావుకారి జానకి కూడా ఉన్నారు. పదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ను అందుకుంది. అలాగే కలెక్షన్లు కూడా రాబట్టంది. ఈ సినిమాను రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.18 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఈ సినిమాను స్వప్న సినిమాస్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. బాగా హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
ఇదిలా ఉండగా నాని ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ లేటెస్ట్‌గా వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఈ టీజర్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. నాని డిఫరెంట్ లుక్, డైలాగ్స్ ఊర మాస్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ అన్ని డిఫరెంట్ లుక్ లో నాని కనిపించబోతున్నాడు. ఎప్పుడు కొత్త పాత్రలో కనిపించే నాని ఈసారి మరో కొత్త లుక్స్ లో రాబోతున్నాడు. ఎవరు ఊహించని విధంగా గ్లింప్స్ ఉన్నాయి. ఒక తల్లి కొడుకు గురించి చెప్పడం అనేది చాలా కొత్త ఐడియా. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
-
Court: అంచనాలు లేకుండా వచ్చిన కోర్టు మూవీ.. మొదటి రోజే కలెక్షన్లు దుల్లగొట్టిందిగా!
-
Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?
-
Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా
-
HIT 3 Teaser: వచ్చేసిన నాని హిట్ 3 టీజర్.. అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. వయెలెంట్‌గా మాములుగా లేదుగా..లాఠీకి దొరికినోడి పరిస్థితి…