OG Movie : ఓజీ’ పార్ట్ 2 లో హీరో పవన్ కళ్యాణ్ కాదా..? ఇదేమి ట్విస్ట్ సామీ!

OG Movie :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాపై కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఎప్పుడు ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చినా రికార్డ్స్ మొత్తం బ్లాస్ట్ అనే రేంజ్ లో ఆశలతో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని కేవలం ఒక్క భాగం లో కాదు, రెండు భాగాల్లో తెరకెక్కించాలని డైరెక్టర్ సుజిత్(Director Sujeeth) సినిమా ప్రారంభం సమయంలోనే అనుకున్నాడు. మొదటి భాగం షూటింగ్ 70 శాతం కి పైగా పూర్తి అయ్యింది. మిగిలిన షూటింగ్ కేవలం 20 రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఈ ఏడాది లోనే పూర్తి చేస్తారు. ఏప్రిల్ నెలలో డేట్స్ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ఇప్పుడు జూన్ లో డేట్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం 20 రోజుల డేట్స్ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ ఇంత సమయం తీసుకుంటున్నాడు, ఇక రెండవ భాగం ఆయనేమి షూటింగ్ చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రెండవ భాగం చేయాలా వద్దా అనే దానిపై ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకవేళ రెండవ భాగానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే, మొదటి భాగం లో 20 నిమిషాల ప్రత్యేక పాత్రలో ఒక ప్రముఖ స్టార్ హీరో కనిపిస్తాడని, రెండవ భాగంలో అతనే హీరోగా నటిస్తాడని టాక్ నడుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ రెండవ భాగానికి ఒప్పుకుంటే, ఆయనే హీరో గా ఉంటాడని తెలుస్తుంది. ఇలా రెండు వెర్షన్స్ స్టోరీ ని సిద్ధం చేసుకొని రెడీ గా ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, ఓజీ పార్ట్ 1 క్లైమాక్స్ లో అకిరా నందన్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.
రెండవ భాగంలో అకిరా నే హీరోగా నటిస్తాడని, పవన్ కళ్యాణ్ కేవలం ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ అనుమతి కూడా కావాలట. జూన్ నెల నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని టాక్ ఉండడంతో, అదే జూన్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేస్తారని తెలుస్తుంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు తమిళ హీరో శింబు గాత్రం అందించాడు. ఈ పాట అద్భుతంగా వచ్చిందట. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజే ఈ పాటని విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, వరదల కారణంగా ఆపేయాల్సి వచ్చింది. దానికి తోడు ‘హరి హర వీరమల్లు’ చిత్రం ముందుగా విడుదల అవుతుండడంతో ‘ఓజీ’ అప్డేట్స్ ని పూర్తిగా ఆపేసారు. మళ్ళీ ఈ సినిమా నుండి అప్డేట్స్ వచ్చేది పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయిన రోజు నుండే అని అంటున్నారు.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?