Villain Rami Reddy : అచ్చం ఒకప్పటి టాలీవుడ్ విలన్ రామిరెడ్డిలా ఉన్న వ్యక్తి.. వీడియో వైరల్..
Villain Rami Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను 1989లో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాలో విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Villain Rami Reddy : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అంకుశం సినిమా తర్వాత రామిరెడ్డికి చాలా సినిమాలలో మెయిన్ విలన్ గా నటించే అవకాశాలు వచ్చాయి. అయితే దివంగత రామిరెడ్డికి పోలిన ఒక వ్యక్తి ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన డైలాగులలో స్పాట్ పెడతా అనే డైలాగ్ కూడా ఒకటి. అంకుశం సినిమాతో బాగా పాపులర్ అయిన రామిరెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగు ఇదే. అంకుశం సినిమాలో విలన్ పాత్రలో రామిరెడ్డి ఒదిగిపోయాడు. ఆ సినిమాలో ఆయన చెప్పిన స్పాట్ పెడతా అనే డైలాగ్ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. రామిరెడ్డి చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయనకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి వంటి భాషలలో కూడా రామిరెడ్డి ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన తన సినిమా కెరియర్ లో 250 కి పైగా సినిమాలలో రకరకాల పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రామిరెడ్డి చివరి సినిమా మర్మం. లివర్ డిసీజ్ కారణంగా ఆయన 55 ఏళ్ల వయసులోనే 2011లో ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
చివరి రోజుల్లో రామిరెడ్డి గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయి ఇంటికి పరిమితమై 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా ఓబులం వారి పల్లె. రామిరెడ్డి సినిమాలలోకి రాకముందు ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా పనిచేసేవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకప్పటి విలన్ రామిరెడ్డి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే. రామిరెడ్డి లానే కనిపించే ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తి ఒక హోటల్లో పని చేస్తున్నాడు. అతను అచ్చం రామిరెడ్డిని పోలి ఉండడంతో అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అలాగే ఈ వ్యక్తి కూడా ఒకప్పటి రామిరెడ్డిని పోలి ఉన్నాడు అని చాలామంది నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం కనిపించినా కూడా చాలామంది తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కు పని చెప్పి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న ఫోన్కు పని చెప్పి అచ్చం రామిరెడ్డి లాగానే కనిపిస్తున్న హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి వీడియోను తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram