Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అశోక వనంలో అర్జున కళ్యాణం బ్యూటీ..
Varun Tej మెగా హీరో వరుణ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మెగా హీరో గని, గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి హ్యాట్రిక్ పరాజయాలతో ఇటీవల డీలా పడిపోయాడు.

Varun Tej: వరుణ్ తేజ్ ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నవంబర్ 14న వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ ను అందుకుంది. చాలా కాలం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక సాలిడ్ పిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్ టాలీవుడ్ లో విభిన్నమైన కథలు, పాత్రలు ఉన్న సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగులో వరుణ్ తేజ్ ముకుందా, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం 9000 కే యం పి హెచ్, ఎఫ్ 2, ఎఫ్3, గద్దెల కొండ గణేష్, గని, గాండీవ దారి అర్జున, మట్కా వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలలో కంచె, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, ఎఫ్ 3, గద్దెల కొండ గణేష్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. దాంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక సాలిడ్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు.
తన చివరగా నటించిన మట్కా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ ఒక విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ సినిమా కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు గాంధీ మిర్లపాక దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమాకు గాను ఒక క్రేజీ హీరోయిన్ ఫైనల్ చేసినట్టు సమాచారం. వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు రితిక నాయక్.
రితిక నాయక్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ చెల్లెలుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం అభినయంతో ఈ బ్యూటీ ప్రేక్షకులను కట్టిపడేసింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ బ్యూటీ మరొక సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ తేజ్ మరియు రితిక నాయక్ సాలిడ్ హిట్ అందుకుంటారేమో వేచి చూడాలి.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా