Salaar 2 and Kalki 2 : సలార్ 2, కల్కి 2 దర్శకులు ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్లో చూపించబోతున్నారా..?

Salaar 2 and Kalki 2 :
సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు. నిజానికి ఒక దర్శకుడు రాసుకున్న కథని తన విజువలైజేశన్ ప్రకారం సినిమాగా తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించి పెడితేనే ఒక హీరోకి స్టార్ డమ్ అనేది వస్తుంది. కానీ ఆ దర్శకుడిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు హీరోలకే పట్టం కడుతూ ఉంటారు…
యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో ప్రభాస్(Prabhas)…ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ (Fouji) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయాల్సిన స్పిరిట్ (Spirit) సినిమా కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత కల్కి 2(Kalki 2) సినిమాలో తను నటించడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక రీసెంట్ గా కల్కి మూవీ దర్శకుడు అయిన నాగస్విన్ ఆ సినిమా గురించి స్పందిస్తూ కల్కి సినిమా మొదటి పార్ట్ లో ప్రభాస్ కి అంత ప్రాధాన్యతనైతే ఇవ్వలేదు. కానీ రెండోవ పార్ట్ లో మాత్రం మొత్తం ప్రభాస్ మీదనే సినిమా రన్ అవ్వబోతుంది అంటూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు. ముఖ్యంగా కల్కి 2 (Kalki 2) లో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసిన ప్రతి ప్రేక్షకులకు ఒక హై ఫీల్ అయితే వస్తుంది. ఇక దాని ద్వారానే ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోగలుగుతారు. ప్రభాస్ ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది.
Also Read: Rajamouli and Mahesh babu : SSMB 29 మూవీ నటీనటులను భయపెడుతున్న రాజమౌళి కొత్త రూల్.
అలాగే విజువల్ ఫిస్ట్ ని కూడా ఈ సినిమా ద్వారా అందించడానికి మేము శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేశాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆయన చేస్తున్న సినిమాలా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అలాగే కల్కి 2 సినిమాలో కూడా ఆయన పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని దర్శకుడు హింట్ ఇచ్చిన తర్వాత అతని అభిమానులు అందరూ సంతోషపడుతున్నారు. ఇక ఇంతకుముందు సైతం సలార్ (Salaar) సినిమా మొదటి పార్ట్ లో ప్రభాస్ ని చాలా తక్కువగా చూపించాను. రెండో పార్ట్ లో తన విశ్వరూపం చూపించబోతున్నాను అంటూ చేసిన కామెంట్లకి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రభాస్ సినిమాలే అనేంతలా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే విధంగా భారీ సక్సెస్ లను కొట్టడానికి ఆయన రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను కనుక అందించినట్లయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ హీరో కాకుండా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…