Thandel: ఉండగానే ఓటీటీలోకి తండేల్.. మరీ ఇంత తొందరగానే.. కారణం ఏంటి?

Thandel: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం తండేల్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి నాగ చైతన్యకు మంచి హిట్ పడలేదు. ఈ సినిమాతో తన ఖాతాలో మంచి హిట్ పడింది. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శ్రీకాకుళం మృత్స్యకారులు జీవిత ఆధారంగా తెరకెక్కించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వహించారు. సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన తండేల్ కూడా హిట్ కొట్టింది. అయితే తండేల్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి పైరసీ సమస్యను ఎదుర్కొ్ంది. కొన్ని కేబుల్ ఛానెల్స్‌లో రావడం, బస్సులో రావడం వంటివి జరిగాయి. అయినా కూడా కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే ఫిబవరి 7న సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి నెల కాకుండానే తండేల్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అసలు తండేల్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
తండేల్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందని తెగ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఓటీటీలోకి సినిమా చాలా ఆలస్యంగా వస్తుందని ఇంకా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ అయ్యింది. అలాంటిది ఇంత తొందరగా సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేస్తే.. లాభం లేదని మూవీ టీం భావిస్తోంది. కనీసం నెల రోజులు కూడా కాకుండానే సినిమాను రిలీజ్ చేయడం కష్టమని భావిస్తోంది. తండేల్ మూవీకి మంచి హిట్ టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం 10 రోజుల్లో 120 కోట్లు వసూల్ చేసింది. దీంతో సినిమాను ఆలస్యంగానే ఓటీటీలోకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కూడా జీవించేశారు. ఆ పాత్రల్లో ఇద్దరూ కూడా ఒదిగిపోయారు. వీరి యాక్టింగ్ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు.
-
Emergency: కంగనా ఎమర్జెన్సీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచంటే?
-
Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?
-
Surya: దాదాపు 15 ఏళ్ల తర్వాత.. తెలుగు డైరెక్టర్‌తో సినిమాకు ఒకే చేసిన తమిళ స్టార్ సూర్య
-
Daaku Maharaaj: ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?