SS Thaman : పవన్ కళ్యాణ్ ని అలా చూడగానే నా రక్తం మరిగిపోయింది : తమన్

SS Thaman :
మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారా స్థాయిలో ఉండేవి. వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్, చాలా కాలం తర్వాత నేటి తరం ఆడియన్స్ కి తగ్గ గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తుండడం తో అందరూ ఎంతో ఆసక్తి ని చూపించారు.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం అప్పుడే 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఓటీటీ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాలి.
దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి అవ్వడానికి కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరం ఉంది. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంగీతం వహిస్తున్న తమన్(SS Thaman) లేటెస్ట్ గా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓజీ గురించి పలు ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చాడు.
‘ఓజీ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. కొన్ని షాట్స్ చూసాను, నా మైండ్ పనిచేయలేదు, ఆ రేంజ్ లో ఉన్నాయి. వీటికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం నాకు పెద్ద ఛాలెంజ్ అనిపించింది. ఓజీ సినిమాకు సంగీతం అందించడం కోసం నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తాన్ని మార్చేసాను. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించే సమయంలో నా రూమ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫొటోలతో నింపేస్తాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనీ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఖరారు చేయగానే, మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఉగాదికి ఈ చిత్రం నుండి విడుదల తేదీ ఉన్నటువంటి పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. వాస్తవానికి ఓజీ చిత్రాన్ని మార్చి 27 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 25 , లేదా డిసెంబర్ నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?