Tamannaah-Vijay Varma: ఆ విషయంలో అండర్‌స్టాడింగ్ కుదరకే.. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్‌కు కారణమిదే

Tamannaah-Vijay Varma:
మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. అయితే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో తమన్నా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా తమన్నా, విజయ్ వర్మ ఇంకా స్పందించలేదు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి ముఖ్య కారణం పెళ్లి, కెరీర్ గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. తమన్నా వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. తను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కావాలని, వివాహ బంధం హాయిగా ఉండాలని భావించింది. కానీ విజయ్ వర్మ పెళ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావించినట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరిక కాస్త అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. కానీ వీరిద్దరి ఫొటోలను మాత్రం ఎప్పుడూ షేర్ చేయలేదు. అయితే విజయ్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సడెన్‌గా విజయ్ వర్మ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో తొలగించడంతో ఇద్దరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.
తమన్నా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. ఈ సిరీస్‌లో హద్దులు మీరి మరి రొమాన్స్ చేశారు. ఈ షూటింగ్ సమయంలో ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రేమ విషయాన్ని తమన్నా బయటపెట్టింది. తన కోసం ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నట్లు తెలిపింది. విజయ్ వర్మ తనని బాగా అర్థం చేసుకున్నాడని తెలిపింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో, ఫ్యాషన్ షోలలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంతలోనే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విడిపోయిన తర్వాత కూడా మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా ప్రస్తుతం ఓదెల 2లో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను కూడా మూవీ టీం ఇటీవల విడుదల చేసింది. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం ఇటీవల రిలీజ్ చేశారు. టీజర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్.. పాకిస్థాన్‌పై నెట్టంట విమర్శలు
-
Champions Trophy 2025: ఆదాయం రూపాయల్లో.. వ్యయం వందల్లో ఇది పాకిస్థాన్ పరిస్థితి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
IND vs PAK: పాక్ మొండిపట్టు.. చివరకు టోర్నీలో ఐదు రోజులే.. నెట్టింట ట్రోల్ చేస్తున్న మీమర్స్