SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
SSMB 29 మహేష్ బాబు కుటుంబంతో కలిసి ఎక్కువగా విహార యాత్రలకు వెళ్తుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్తారా? అంటే వారిలో మహేష్ పేరు మొదటగా వినిపిస్తుంది.

SSMB 29: దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB29 సినిమా రాబోతుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా అంటే ఏ హీరో అయినా సరే.. ఒక రెండేళ్ల సమయం వెచ్చించాల్సిందే. అన్ని సినిమాలను పక్కన పెట్టి మరి రాజమౌళి సినిమా చేయాలి. అయితే ఈ SSMB29 సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే రాజమౌళి మహేష్ బాబు పాస్‌పోర్టును తీసుకున్నారు. మూడు నెలల క్రితం తన పాస్ పోర్టు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పాస్ పోర్టు వీడియో వైరల్ అవుతోంది. నా పాస్ పోర్టు నా దగ్గర ఉందని, మహేష్ బాబు ఎయిర్‌పోర్టులో పాస్‌పోర్టును చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది బాగా వైరల్ కావడంతో మీమర్స్ వెంటనే స్టార్ట్ చేశారు. మై పాస్ పోర్ట్ ఈజ్ బ్యాక్, వచ్చేసిన పాస్‌పోర్టు అని, రాజమౌళి ఫ్రీడమ్ ఇచ్చాడని, వెకేషన్‌కి పర్మిషన్ ఇచ్చాడని, ఇక నన్ను ఆపేది ఎవరూ లేరని.. ఇలా సోషల్ మీడియాలో ఎన్నో మీమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు మూడు నెలల తర్వాత మహేష్ బాబుకి రాజమౌళి పాస్‌పోర్టు ఇచ్చాడు. దీంతో సరదాగా మహేష్ బాబు ఆ పాస్‌పోర్టును ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు చూపించడంతో వైరల్ అవుతోంది. మహేష్ బాబు కుటుంబంతో కలిసి ఎక్కువగా విహార యాత్రలకు వెళ్తుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్తారా? అంటే వారిలో మహేష్ పేరు మొదటగా వినిపిస్తుంది.
Only Promotional Thing Used In INDIA’s BIGGEST EVER MOVIE Is A PASSPORT 😆@urstrulyMahesh @ssrajamouli #SSMB29 pic.twitter.com/moJZWklovh
— Smudge (@Hitesh5ir) April 5, 2025
ఇదిలా ఉండగా మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా రెండు పార్ట్‌లు వస్తుందని అన్నారు. కానీ ఈ సినిమా మొత్తం రెండు పార్ట్‌లు రాదని, కేవలం ఒక పార్ట్ మాత్రమే వస్తుందని వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాలా రెండు పార్ట్‌లు ఉండదు. కానీ ఈ సినిమాలనే ప్లానింగ్ బహుబలికి మించి ఉంటుందని అంటున్నారు. బాహుబలి రేంజ్‌లో సినిమా తీస్తున్న ఎగ్జిక్యూషన్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. సినిమా సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు పార్ట్‌లుగా తీయకుండా ఒక పార్ట్‌లోనే పూర్తి చేయాలని మూవీ టీం భావిస్తుందట. అయితే ఆలస్యంగా తీసినా కూడా రాజమౌళి మూవీ విషయంలో పెద్ద ప్లానింగ్‌తోనే ఉంటారు. మూవీలో కూడా ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Passport is back to @urstrulyMahesh hand 😎🔥#SSMB29 #MaheshBabu pic.twitter.com/Jp5dvepga9
— KonaseemaSSMBFC (@KonaseemaSSMBFC) April 5, 2025
Happy Journey anna 🙂 pic.twitter.com/XEYeC8E9V8
— ETV Win (@etvwin) April 5, 2025
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా
-
Crazy Tollywood Heroine: ఎంబీబీఎస్ ఎగ్జామ్ కోసం మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా…