Srikanth Addala: ఆ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. నిజమేనా?

Srikanth Addala: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో మంచి హిట్ కొట్టారు. ఈ రెండు సినిమాలు కూడా యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు అయితే ఇప్పటికీ బెస్ట్ మూవీ అన్నట్లుగా ఉంది. ఇటీవల రీ రిలీజ్ అయ్యి కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. వరుస సినిమాలు తీసి ఆ తర్వాత బ్రహ్మోత్సవం మూవీ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో పాటు డిజాస్టర్‌గా నిలిచింది. దీని తర్వా పెద కాపు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. వరుసగా ఒక సినిమా కూడా మంచి హిట్ పడకపోవడంతో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ అడ్డాల గురించి ఓ వార్త జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఓ కోలీవుడ్ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ కోలీవుడ్ బ్యూటీ? వార్తలు నిజమేనా? అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన పెదకాపు మూవీలో తమిళ హీరోయిన్ బ్రిగిడా నటించింది. ఈమెతో శ్రీకాంత్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందట. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే శ్రీకాంత్‌కి తన భార్యతో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ముందు నుంచే తన భార్యతో గొడవలు ఉన్నాయని, వాటి కారణంగా బ్రిగిడాకి దగ్గర అయ్యారని అంటున్నారు. బ్రిగిడా తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. కానీ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై శ్రీకాంత్, బ్రిగిడా ఇద్దరూ కూడా స్పందించలేదు. దీనిపై ఇద్దరు స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. అయితే వీరిద్దరి మధ్య డేటింగ్ ఏంటని నెటిజన్లు అంటున్నారు. ఇంత వయస్సు గ్యాప్ ఉన్న వ్యక్తితో డేటింగ్ ఏంటని కొందరు అంటున్నారు. మరికొందరు అతని సినిమాలో నటించడం వల్ల స్నేహం కారణంగా ఇలా అంటున్నారని మరికొందరు అంటున్నారు. అయితే బ్రిగిడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోదని పలువురు అంటున్నారు. మరి ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తే క్లారిటీ వస్తుంది.