Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?

Subhman Gil:
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ (Subhman Gil) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆటతో టీమిండియా జట్టులో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన బ్యాటింగ్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కేవలం క్రికెట్‌లోనే కాకుండా అందంలోనూ కూడా గిల్‌కి ఎవరూ తీసిపోరు. ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా గిల్‌కి బాగానే ఉంది. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో పుకారు వస్తుంది. శుభమన్ గిల్ మరో కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ నటితో ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడని, గిల్ కోసం ఆమె మ్యాచ్ వీక్షించడానికి కూడా వెళ్లిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరో చూద్దాం.
టీవీ నటి అవనీత్ కౌర్‌తో శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం దీని గురించే తెగ చర్చిస్తోంది. ఇటీవల దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు సెమీ ఫైనల్ మ్యాచ్‌కి అవనీత్ కౌర్ వెళ్లినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌కి దుబాయ్ స్టేడియంలో అవనీత్ కౌర్ మ్యాచ్ వీక్షించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. స్టేడియంలో మ్యా్చ్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఫొటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, గిల్ కోసమే అవనీత్ కౌర్ మ్యాచ్ చూడటానికి వెళ్లిందని రూమర్స్ వస్తున్నాయి. దీంతో నెటిజన్లు మ్యాచ్ చూడటానికి వెళ్లావా లేకపోతే గిల్‌ని ఎంకరేజ్ చేయడానికి వెళ్లావా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం వీరి గురించే చర్చ జరుగుతోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీవీ నటి అయిన అవనీత్ కౌర్ (Avneet Kaur) కు సోషల్ మీడియాలో భాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె ఎక్కువగా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. కొన్ని మ్యూజిక్ సాంగ్స్ చేయడం, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్‌లో చేరింది. వీటితో పాటు పలు షోలలో కనిపించడంతో ఈమెకు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవనీత్ కౌర్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రూమర్స్‌పై ఇంకా ఇద్దరూ స్పందించలేదు. ఇప్పుడు ఈమెతో డేటింగ్‌లో ఉండటంతో సచిన్ కూతురు సారాతో ఇక రిలేషన్ లేనట్టేనా అని నెటిజన్లు అంటున్నారు.
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?