Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం ఆ రోజే ఓటీటీలోకి.. థియేటర్లలో రాని సీన్లు కూడా..

Sankranthiki Vastunnam:
హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విన్నర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ కంటే టీవీలోనే ముందుగా ప్రసారం చేస్తున్నారు. మార్చి 1వ తేదీన జీ తెలుగులో సినిమా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. త్వరలో ఓటీటీలోకి కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్‌కి మూవీ టీం ఓ సర్‌ప్రైజ్‌ను ఇవ్వనుంది. డిలీట్ చేసిన సీన్లను యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు ముఖ్యమైన సన్నివేశాలు యాడ్ చేసి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి, వెంకటేష్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేయనున్నారట. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.
సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ కూడా అలరించింది. మంచి హిట్ టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు రూ.300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో (OTT) కంటే ముందుగానే టీవీల్లోకి వచ్చేస్తుంది. మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లోకి సినిమా వచ్చే అవకాశం ఉందని ముందుగానే మూవీ టీం ప్రకటించింది. అయితే మహా శివరాత్రి సందర్భంగా సినిమా టీవీలో ప్రసారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ సినిమాను మార్చి 1వ తేదీన ప్రసారం చేయనున్నట్లు తాజాగా జీ తెలుగు ప్రకటించింది. అయితే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఓటీటీలోకి వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీవీలో ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో రికార్డు సృష్టించినట్లే టీవీల్లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చింది. దీనికి భీమ్స్ సెసిరోలియో సంగీతం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.