Ruhani Sharma: దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఇక ఆమె దశ తిరిగినట్టే.
Ruhani Sharma సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా లక్కీ భాస్కర్ సినిమాను నిర్మించాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే దుల్కర్ సల్మాన్ 2012లో రిలీజ్ అయిన సెకండ్ షో అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Ruhani Sharma: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో తెలుగులో కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. టాలీవుడ్ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా గురించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. లేటెస్ట్ గా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వ వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించారు. గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా లక్కీ భాస్కర్ సినిమాను నిర్మించాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే దుల్కర్ సల్మాన్ 2012లో రిలీజ్ అయిన సెకండ్ షో అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రిలీజ్ అయిన ఉస్తాద్ హోటల్ అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక తెలుగులో ఓకే బంగారం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఓకే బంగారం సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగులో కూడా రిలీజ్ అయ్యే మంచి విజయాలు సాధించాయి. తాజాగా ఈయన తెలుగు దర్శకుడు తో ఒక సినిమా చేయబోతున్నారు అన్న వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు ఆకాశంలో ఓ తార అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ రుహాని శర్మ హీరోయిన్గా నటించే అవకాశం అందుకుందని తెలుస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చిలసౌ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. అయితే చిలసౌ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రుహాని శర్మ ఆ తర్వాత మాత్రం సరైన సక్సెస్ అందుకోలేదు. తాజాగా ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఆమె రేంజ్ మారిపోయినట్టే అని అందరూ అంటున్నారు.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా