RK Roja: బుల్లి తెరపై మళ్లీ రీ ఎంట్రీ.. ఆ ఛానెల్‌లో ప్రసారమయ్యే షోకు జడ్జ్‌గా రోజా

RK Roja:
ఏపీ మాజీ మంత్రి రోజా సెల్వమణి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సీని ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, జగపతి బాబు, వెంకటేష్ ఇలా అందరి సరసన నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడంతో పాటు బుల్లితెరపై పలు షోలు చేసేది. వాటికి జడ్జిగా కూడా వ్యవహరించేది. ఈటీవీలోని జబర్దస్త్ వంటి పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. ఈ షోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటిలో కొన్నేళ్ల పాటు రోజా జడ్జిగానే కొనసాగుతూ వచ్చింది. అయితే గత ప్రభుత్వం వైసీపీ రూలింగ్ చేసింది. ఈ సమయంలో రోజా నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇందులో రోజా గెలిచింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రోజా పలు షోలకు జడ్జిగా కూడా చేసింది. కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రోజాకి టూరిజం మినిస్టర్ పదవిని ఇచ్చింది. పదవి రావడంతో రోజా బుల్లి తెర షోలకు గుడ్ బై చెప్పింది. మంత్రి పదవిలో ఉండి ఇలా షోలు చేయడం ఏంటని ఎక్కువగా విమర్శలు రావడంతో రోజా గుడ్ బై చెప్పింది. అయితే మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో ఓ షో రాబోతుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 అనే షోకి రోజా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రోజా సందడి చేసింది. ఈ ప్రోమోలో రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఉన్నారు. అయితే వీరంతా ఈ షోకి జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ షో మార్చి 2వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. అయితే ఈ షోలో యాంకర్లుగా రవి, అషురెడ్డి యాంకర్స్‌గా కనిపించారు.
ఈ ప్రోమోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాశి ముందు మాట్లాడితే ముత్యాలు రాలుతాయి. కానీ రోజా ముందు మాట్లాడితే పళ్లు రాళ్లతాయని అన్నాడు. దీంతో షోలు ఉన్నవారు అందరూ కూడా నవ్వారు. అయితే ఈ షోలో వీరితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చైల్డ్ ఆర్టిస్టు రేవంత్ కూడా సందడి చేయబోతున్నారు. ఈ షోలో సీరియల్ టీమ్స్ పోటీ పడనున్నాయి. మొత్తం 16 సీరియల్స్‌కి సంబంధించిన వారు కేవలం ఒక్క ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. ఈ షోలో చామంతి, ప్రేమ ఎంత మధురం, మేఘ సందేశం, అమ్మాయి గారు, ఎన్నోళ్లో వేచిన హృదయం, జగద్ధాత్రి, భాగ్యవతి, గుండమ్మ కథ, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, పడమటి సంధ్యారాగం, సీతే రాముడి కట్నం, ఉమ్మడి కుటుంబం, నిండు నూరేళ్ల సావాసం, ముక్కు పుడక వంటి సీరియల్ ఆర్టిస్టులు ప్రేక్షకులను అలరించబోతున్నారు.
-
Sankranthiki Vastunnam: బిగ్గెస్ట్ మైల్ స్టోన్ దాటవేసిన వెంకీ మామ మూవీ.. ఓటీటీలో రికార్డులు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం
-
Sankranthiki Vastunnam: ఓటీటీ కంటే ముందుగానే.. టీవీల్లోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ
-
Kshemamga Velli Labhamga Randi: క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. సినిమా గురించి మీకు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?