Peddi Movie: RC16 సినిమా టైటిల్ ఫిక్స్.. రామ్ చరణ్ లుక్ గూస్ బంప్స్

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి వారసత్వంగా వచ్చినా కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. RRR సినిమాతో స్టార్ హీరోల సరసన చేరాడు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
RAM CHARAN'S NEXT PAN-INDIA BIGGIE TITLED 'PEDDI' – FIRST LOOK IS HERE… Looks SMASHING… On #RamCharan's birthday today, the much-awaited #FirstLook and title of #RC16 have been revealed… #RC16 is titled #Peddi.
The film marks #RamCharan's first collaboration with director… pic.twitter.com/shltfUtEun
— taran adarsh (@taran_adarsh) March 27, 2025
ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని RC16గా పిలిచారు. ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్‌ను మూవీ టీం ఫిక్స్ చేసింది. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ సినిమాకు ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా మూవీ టీం రిలీజ్ చేసింది. పోస్టర్ లుక్ అయితే అదరిపోయింది. రామ్ చరణ్ లుక్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. పోస్టర్‌లో రామ్ చరణ్ నోట్లో బీడీ పెట్టుకుని డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్‌లో చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక రగ్గుడ్ లుక్‌లో చరణ్ కనిపిస్తున్నాడు. సినిమాలో కూడా దేని కోసమో పోరాడుతున్నట్లు తెలుస్తుంది. దేనికి భయపడని ఓ యోధుడిలా యుద్ధం చేసే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఇలాంటి లుక్ లో అయితే అసలు కనిపించలేదు. మొదటి నుంచి బుచ్చి బాబు సినిమా స్టోరీ డిఫరెంట్ ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెబుతున్నారు. దానికి ఏ మాత్రం తీసిపోకుండా పోస్టర్ ఉంది. రామ్ చరణ్ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త డిఫరెంట్ స్టోరీలో ఉన్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్‌తో ఫ్లాప్ టాక్ అందుకున్న రామ్ చరణ్.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ మళ్లీ కొడతాడని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా లుక్ అయితే డిఫరెంట్‌గా అదిరిపోయిందని, తప్పకుండా ఈ సారి హిట్ ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. అయితే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతందో.. ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
APPSC : ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి
-
Jatadhara: జటాధరలో సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందిగా!
-
Allu Arjun-Trivikram Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. త్రివిక్రమ్, బన్నీ మూవీ ఎప్పుడో రివిల్ చేసిన నిర్మాత