Rajamouli-Srinivasarao: 30 ఏళ్ల కిందట అసలు రాజమౌళి జీవితంలో ఏం జరిగింది.. బయటపడ్డ నిజాలు

Rajamouli-Srinivasarao:
దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇతని గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్‌ను పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అసలు రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదు. తీసిన ప్రతీ సినిమా కూడా హిట్‌గానే నిలిచింది. సినీ ఇండస్ట్రీలో రాజమౌళి వివాదాలకు, కాంట్రవర్సరీకి చాలా దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఓ వివాదంలో రాజమౌళి చిక్కుకున్నాడు. రాజమౌళి స్నేహితుడు శ్రీనివాస రావు తనని అరెస్టు చేయాలని అంటున్నాడు. అసలు రాజమౌళికి, శ్రీనివాసరావుకి 30 ఏళ్ల కిందట ఏం జరిగింది? శ్రీనివాసరావు ఎందుకు అరెస్టు చేయాలని ఆరోపించారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
రాజమౌళి తనని చాలా టార్చర్ పెట్టాడని శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో ద్వారా ఆరోపించాడు. రాజమౌళి, తన భార్య ఇద్దరూ కలిసి శ్రీనివాసరావుని బెదిరించారని, వారి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం లేదని, ఎంఎం కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ వంటి పెద్ద పెద్ద వాళ్లలో కలిసి పనిచేశానని తెలిపాడు. శ్రీనివాస రావు, రాజమౌళి 1990 నుంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ సమయంలో వారి మధ్య ఓ అమ్మాయి వచ్చిందని, తన వల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని వీడియోలో తెలిపాడు. రాజమౌళి, శ్రీనివాస రావు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించానని, అమ్మాయిని తన కోసం త్యాగం చేశానని తెలిపాడు. ముగ్గురం కలిసి ఒకే గదిలో ఉందామని, చాలా ఇలా చేస్తే బాగోదని రాజమౌళి అన్నట్లు తెలిపాడు. దీంతో ఆ అమ్మాయికి దూరంగా ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు ఆ విషయాలు అన్ని కూడా నేను ఇతరులకు చెబుతానని తనని టార్చర్ పెట్టాడని, వారి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వీడియో పెట్టారు. అయితే ఎలాంటి వివాదాలకు దగ్గరకు వెళ్లని రాజమౌళిపై ఒక్కసారిగా ఆరోపణలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
శ్రీనివాసరావుకి మతి స్థిమితం సరిగ్గా లేదని, కావాలనే ఆరోపణలు చేస్తున్నాడని చిట్టిబాబు మీడియాతో తెలిపారు. ఎప్పుడో 27 ఏళ్ల క్రితం జరిగిన విషయాలను ఇప్పుడు చెబుతున్నాడు. వీటికి సంబంధించి అసలు ప్రూఫ్స్ కూడా లేవని, కావాలనే శ్రీనివాస రావు ఆరోపణలు చేస్తున్నాడన్నారు. రాజమౌళి, శ్రీనివాస రావు ఒకప్పుడు స్నేహితులు కావచ్చు. ఇప్పుడు రాజమౌళి పెద్ద పొజిషన్‌లో ఉన్నాడని ఇలా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఆధారాలు ఉండవు. కావాలనే రాజమౌళిపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని చిట్టి బాబు అన్నాడు. ఒక సెల్ఫీ వీడియో తీసి, రాజమౌళిపై ఆరోపణలు చేస్తే ఎలా నమ్మేస్తారు. నేను ఒక వీడియో తీసి ఆత్మహత్యకు కారణం వేరే వాళ్లు అని అనేస్తా.. నమ్మేస్తారా? మీరు కూడా అని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇంకా రాజమౌళి స్పందించలేదు.
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్‌లు కాదు!
-
Rajamouli and Mahesh babu : SSMB 29 మూవీ నటీనటులను భయపెడుతున్న రాజమౌళి కొత్త రూల్…
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?
-
SSMB29 లీక్ బజ్ క్రియేషన్ కోసం మూవీ టీం కావాలనే చేసిందా? ఇందులో నిజమెంత?
-
Anil ravipudi: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనా? రాజమౌళి బాటలోనే నడుస్తున్నాడా?