Payal Rajput: పెళ్లికి రెడీ అయిన పాయల్ రాజ్‌పుత్.. ఇంతకీ వరుడు ఎవరంటే?

Payal Rajput:
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ రాజ్‌పుత్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాతో గ్లామర్ షోతో కుర్రాళ్లను పిచ్చెక్కించింది. ఈమె స్పీడ్‌ను చూసి చాలా మంది స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే బోల్డ్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో కంటే బాలీవుడ్, పంజాబీ సినిమాల నుంచి భారీగా ఆఫర్లు వచ్చాయి. ఇటీవల తెలుగులో మంగళవారం సినిమాలో నటించింది. ఈ మంగళవారం సినిమా గతేడాది రిలీజ్ అయ్యింది. మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్‌గా మంగళవారం 2 సినిమా కూడా రాబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్తే.. ఫొటోలు అప్‌లోడ్ చేస్తుంటుంది. అయితే పాయల్ రాజ్‌పుత్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబీ స్టైల్‌లో పాయల్ పెళ్లి కూతురుగా కనిపించింది. అయితే నిజంగానే పెళ్లి చేసుకుందా? లేకపోతే కేవలం పెళ్లికి రెడీ అయ్యిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
పాయల్ రాజ్‌పుత్ పంజాబీ హీరో సౌరభ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఎప్పటి నుంచే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన చాలా ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ కలిసి కనిపించారు. పాయల్, సౌరభ్ కలిసి ఉన్న ఫొటోలను కూడా పాయల్ చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల సౌరభ్ పుట్టిన రోజు అయినప్పుడు కూడా పాయల్ విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. మరి దీనిపై పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తేనే విషయంపై క్లారిటీ వస్తుంది. గత ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న సౌరబ్ నటుడు, మ్యూజిక్ కంపోజర్, నిర్మాత కూడా. ఏది ఏమైనా పాయల్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కాకపోతే దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.