Nani: తన ఇంట్లో రీల్స్ చేస్తున్నందుకు డైరెక్టర్ ని గెంటేసిన నాని..వీడియో వైరల్!
Nani: అటు హీరోగా, ఇటు నిర్మాతగా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ మంచి ఫామ్ లో ఉన్న నటుడు నేచురల్ స్టార్ నాని|(Natural Star Nani). దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత, ఆయన నిర్మించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకు ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఈ సినిమా తో పాటు నాని హీరో గా నటిస్తూ ‘హిట్ 3’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రొమోషన్స్ ని మొదలు పెట్టేసారు. మన అందరికీ తెలిసిందే, నాని తన సినిమాకు ప్రొమోషన్స్ చాలా కొత్త పద్దతిలో చేస్తాడు అనే సంగతి. ఇప్పుడు హిట్ 3(Hit : The Third Case) కి కూడా అలాంటి ప్రొమోషన్స్ ని మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఒక వీడియో ని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాడు. తన ఇంట్లో కొరియోగ్రాఫర్స్ తో డైరెక్టర్ శైలేష్ కొలను హుక్ స్టెప్స్ ని కంపోజ్ చేయిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నాయి స్టెప్పులు అని హీరోయిన్ ని శైలేష్ అడగగా, బాగానే ఉన్నాయి, కానీ అర్జున్ క్యారక్టర్ కి ఇలాంటివి సెట్ అవుతాయా అని అడుగుతుంది. ఇంతలోపే నాని అక్కడికి వచ్చి ‘హలో..ఏమి చేస్తున్నారు మీరిక్కడ’ అని అడుగుతాడు. రీల్స్ కోసం హుక్ స్టెప్స్ ని కొరియోగ్రఫీ చెయ్యిస్తున్నాను అని శైలేష్ అంటాడు. అప్పుడు నాని ‘రీల్సా..మనం చేస్తున్న సినిమా ఏమిటి..దానికి రీల్స్ ఏమిటి..బయటకి వెళ్ళండి’ అని గెంటేస్తాడు.
:
అప్పుడు హీరోయిన్ కూడా బయటకు వెళ్తుంటే నాని చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ‘నేను రీల్స్ వద్దు అన్నాను, రొమాన్స్ వద్దు అనలేదు’ అని అంటాడు. ఇది ‘హిట్ 3’ మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించిన ప్రమోషన్ అన్నమాట. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ నెల్ 24న ఈ పాట విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నాని ని ఇంతకు ముందు ఈ రేంజ్ మాస్ యాంగిల్ లో ఎప్పుడూ చూడలేదు, టీజర్ లో ఉన్న యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమాలో చూడబోతున్నామని అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా