Monalisa : వామ్మో మోనాలిసా రేంజ్ ఇలా పెరిగిపోయింది ఏంటి? ఏకంగా స్టార్ డైరెక్టర్ తో కేరళ ప్రయాణం.. ఎందుకంటే?

Monalisa : మోనాలిసా మోనాలిసా మోనాలిసా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే పేరు వినిపిస్తోంది. చాలా మంది ఈమెకు తెగ ఫ్యాన్స్ అయిపోయారు. ప్రయాగరాజ్ లో పూసలు అమ్ముకుంటూ ఉండే ఈ బ్యూటీ తన అందమైన మొహం తో ఎంతో మందిని ఆకట్టుకొని ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఓ యూట్యూబర్ ఆమెతో మాట్లాడుతూ తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆమె వైరల్ గా మారింది. దీంతో పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈమెతో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే ఈ బ్యూటీ తెగ ఫేమస్ అయింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్మడానికి వచ్చింది. కానీ తన అందం, అమాయకత్వంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. తన నవ్వు, రూపం, తేనె కళ్లు కోట్ల జనాల మనసులో నిలిచిపోయాయి. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ మోనాలిసా. ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్ గా మారడంతో ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఈమె లైఫ్ బిఫోర్ కుంభమేళ, ఆఫ్టర్ కుంభమేళ అనే విధంగా మారింది.
ఈమె క్రేజ్ గురించి ఆలోచించడం కూడా తక్కువే. ఓకేసారి వైరల్ గా మారి స్టార్లతో ఛాన్స్ లు కొట్టేస్తుంది మోనాలిసా. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు ఏకంగా ఓ బాలీవుడ్ సినిమాలో అవకాశం అందుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ది డైరీస్ ఆఫ్ మణిపూర్ లో ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించనుందట. దీని కోసం ఈమెను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇదెలా ఉంటే ఇప్పుడు ఆమె ఏకంగా ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కూడా వెళ్లింది. అది కూడా కేరళ వెళ్లింది మోనా.
ఏకంగా డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ప్లైట్ లోనే కేరళకు వెళ్లింది. అయితే డైరెక్టర్ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎస్కలేటర్ మీద వెళ్లారు. అక్కడ కూడా కాస్త ఇబ్బంది పడింది మోనా. కానీ తనకు డైరెక్టర్ సహాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే హనీ రోజ్ ను వేధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయననే రీసెంట్ గా మరో బంగారు ఆభరణాల దుకాణం ఓపెన్ చేశారు. దీని ఓపెనింగ్ కు వెళ్లింది మోనాలిసా. అంటే స్పెషల్ గెస్ట్ అన్నమాట. దీంతో ఈ బ్యూటీని చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఈ ఈవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్, ఒంటి నిండా ఆభరణాలు వేసుకొని అందంగా కనిపించింది మోనాలిసా. మరి ఆ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి.