Meena : మీనా కూతురు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు.. స్టన్నింగ్ లుక్స్..

Meena :
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మీనా బాగా గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మీనా ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది.తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలలో నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ మీనా యాక్టివ్ గా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా ఎన్ని సినిమాలలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే అందంతో ఇప్పటికీ కూడా మీనా వెండితెరపై సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించింది. చిన్నప్పుడే ఈమె అవకాశాలు రావడంతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు జోడిగా నటించిన. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది మీనా. కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది.
2009లో మూడు వివాహం జరిగింది. 2011లో ఈ జంటకు నైనిక అనే అమ్మాయి జన్మించింది. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంతో 2022లో కన్నుమూశారు. మీనా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు హీరోయిన్గా అలరించిన మీనా ప్రస్తుతం సహాయ నటిగా కూడా కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీనా 40 ఏళ్లు దాటిపోయింది. ఈ సందర్భంగా మీనాకు చెన్నైలో ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం చేసి గౌరవించారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీనా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన క్రేజీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తన కూతురి ఫోటోలను కూడా షేర్ చేస్తుంది మీనా. తాజాగా మీనా కూతురు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లిలాగే ఉంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీనా కూతురు విజయ్ హీరోగా నటించిన పోలీసోడు సినిమాలో హీరో కూతురిగా నటించింది. భాస్కర్ ఓరు రాస్కెల్ సినిమాలో అరవిందస్వామి తో నటించింది.

Meena Daughter