Manchu Vishnu And Manoj: ‘కన్నప్ప’ కి పోటీగా మంచు మనోజ్ చిత్రం..అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరు!

Manchu Vishnu And Manoj:
గత కొంత కాలంగా మంచు కుటుంబ వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాము. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే రేంజ్ కి ఈ గొడవలు చేరాయి. మంచు మనోజ్(Manchu Manoj) వెనుక అతని భార్య మౌనిక తప్ప, కుటుంబం నుండి ఎవరి సపోర్టు కూడా లేదు. కన్నతల్లి కూడా రివర్స్ అయిపోయింది. ఇక తమ్ముడికి ప్రతీ విషయంలోనూ అండగా ఉండే మంచు లక్ష్మి అసలు ఈ వ్యవహారంతో నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పటికీ కోర్టు లో వీళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంది.
మోహన్ బాబు(Manchu Mohan Babu) నా కొడుకు మనోజ్ కి తన ఆస్తులను అనుభవించే హక్కు లేదని, తక్షణమే తన ఆస్తులను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఫిర్యాదు చేశాడు. మనోజ్ కూడా ఈ విషయం లో పోరాటం చేస్తున్నాడు. అసలు ‘తగ్గేదేలే’ అనే తీరులో ఆయన వ్యవహరిస్తున్నాడు. అంతిమ తీర్పు ఏమొస్తుందో ఇప్పుడే చెప్పలేము కానీ, ఏప్రిల్ 25న మంచు బ్రదర్స్ మధ్య బాక్స్ ఆఫీస్ పోరు జరగనుంది.
మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మాతగా, హీరో గా డ్యూయల్ రోల్ చేస్తూ వ్యవహరిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు ఇలా ఎంతో మంది లెజెండ్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు, రెండు టీజర్స్ వచ్చాయి. శివుడి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, టీజర్స్ కి అసలు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రెండు టీజర్స్ లోనూ మంచు విష్ణు నే సినిమాకు పెద్ద మైనస్ లాగా అనిపించాడు ఆడియన్స్ కి. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ‘భైరవం’ చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.
బెల్లం కొండ శ్రీనివాస్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. నారా రోహిత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని కూడా ఏప్రిల్ 25 న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా పర్వాలేదు అనిపించుకుంది. ‘కన్నప్ప’ కంటే ఈ సినిమా పై ప్రేక్షకుల ఎక్కువ ఆసక్తి ఉండడం విశేషం. చూడాలి మరి ఏప్రిల్ 25 న అన్నదమ్ముల మధ్య జరగబోయే పోరులో ఎవరు గెలుస్తారు అనేది.
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా