Kangana Ranaut: కంగనా ఎమర్జెన్సీ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా? ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

Kangana Ranaut: యథార్థ సంఘటనలు, బయోపిక్ లు ప్రేక్షకులను చాలా మెప్పిస్తున్నాయి. ప్రజలకు ఈ సినిమాలు ఎక్కువగా నచ్చేస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ లతో పాటు ఈ సినిమాలు కూడా మంచి ప్రేక్షకాధారణను పొందుతున్నాయి. కానీ వాస్తవ సంఘటనలను సినిమాగా తెరకెక్కించే సమయంలో కొన్ని వివాదాస్పద సంఘటనలు సినిమాను చిక్కుల్లో పడేస్తుంటాయి. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన ఎమర్జెన్సీ కూడా అదే విధంగా వివాదాస్పదం అయింది. ఇక ఎన్నో అంచనాలను పెంచిన ఈ సినిమా థియేటర్ లలో పెద్దగా రెస్పాన్స్ ను మాత్రం సొంతం చేసుకోలేదు. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించింది కంగనా రనౌత్. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వలేదు. ఇందిరా గాంధీ పాలనలో వచ్చిన ఎమర్జెన్సీని ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. ఈ విషయానికి సంబంధించిన కీలక విషయాలు సినిమాలో ప్రస్తావించారట. స్వయంగా ఇందిరా పాత్రను కంగనా రనౌత్ పోషించారు. మణికర్ణిక ఫిలింస్, జీ స్డూడియో బ్యానర్ల మీద కంగనా రనౌత్, జీ స్డూడియో, రేణు పిట్టిలు ఈ సినిమాను నిర్మించారు. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ అయిందట.
అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, సతీష్ కౌశీక్, మహిమా చౌదరీ లు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదలైన దగ్గర నుంచి ఫుల్ హైప్ వచ్చింది. ట్రైలర్, టీజర్ లు సినిమా మీద అంచనాలను పెంచాయి. అయితే ఖలిస్తాన్ ఉద్యమం, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్, బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం వంటి సంఘటనలను కూడా కంగనా టచ్ చేసిందనే వార్తలు వచ్చాయి. సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఎమర్జెన్సీ సినిమా ఉందని టాక్ రావడంతో సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి ద్వారా పర్భంధక్ కమిటీ సెన్సార్ బోర్డ్ కు లేఖ రాసింది.
కంగనాను చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అందుకే ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ అనుమతి దక్కలేదు. ఇక న్యాయ పోరాటానికి దిగిన కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సున్నితమైన కంటెంట్ ను తొలగిస్తే అనుమతిస్తామని తెలిపింది సెన్సార్. ఏకంగా 13 కట్ లను సూచించింది. కంగనా అనుమతించడం, సెన్సార్ ఒకే చెప్పడం జరగడంతో అన్ని అడ్డంకులు తొలగి జనవరి 17న ఎమర్జెన్సీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. 60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు కేవలం రూ. 21 కోట్లు మాత్రమే వచ్చాయట. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. దీనికి ముగింపు పలుకుతూ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 17న స్ట్రీమింగ్ కానుందని తెలియజేసింది కంగన. మరి బిగ్ స్క్రీన్ మీద అంతంత మాత్రమే ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.