Sukumar And Shahrukh Khan: త్వరలో సుకుమార్, షారుక్ ఖాన్ కాంబోలో సినిమా.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త…

Sukumar And Shahrukh Khan:
ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన దర్శకుడిని ఏ హీరో అయిన ఊరికే వదిలేస్తారా.. మాతో సినిమా చేయండి, మాతో సినిమా చేయండి అంటూ ప్రతి హీరో కూడా వెంటపడతారు.
సౌత్ లో టాలెంటెడ్ దర్శకుడు అంటే నార్త్ లో షారుక్ ఖాన్ ఊరికే ఉంటారా. అప్పట్లో షారుఖ్ ఖాన్ లుంగీ డాన్స్ లుంగీ డాన్స్ అంటూ చేసిన హంగామా అంతా ఇంకా కాదు. సౌత్ సినిమా ఇండస్ట్రీ మీద బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు ఎప్పటినుంచో కాన్సన్ట్రేషన్ ఉంది. సడన్గా ఆయన ఒకరోజు దర్శకుడు అట్లీని పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు కూడా అందరూ అలాగే అనుకున్నారు. అయితే దర్శకుడు అట్లీ జవాన్ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.
షారుక్ ఖాన్ ని దర్శకుడు అట్లీ ఎంతో సందడిగా బిగ్ స్క్రీన్ మీద చూపించేసరికి షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అదే హవా పుష్ప దర్శకుడు కంటిన్యూ చేయబోతున్నారు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ తర్వాతి సినిమా దర్శకుడు సుకుమార్ తోనే అని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ చెప్పిన కథ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి బాగా నచ్చింది అనే న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మరి ఈ దర్శకుడు తన ఒరిజినల్ స్టైల్ లో షారుఖ్ ఖాన్ ని క్లాస్ గా చూపిస్తారా లేకపోతే మారిపోయిన సుకుమార్ లాగా మాస్ లుక్ లో చూపిస్తారా అనే చర్చ కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జరుగుతుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. గత ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సొంతం చేసుకుని తన సత్తా చాటారు. ఇందులో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు సౌత్ సినిమా దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దర్శకుడు అట్లీ షారుక్ ఖాన్ ను సరికొత్త లుక్ లో చూపించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.
Also Read: Ajith: దాదాపు 25 ఏళ్ల తర్వాత అజిత్ సినిమాలో నటించబోతున్న స్టార్ హీరోయిన్…ఫ్యాన్స్ కు పూనకాలే…
ఇక టాలీవుడ్ దర్శకుడు సుకుమారు గురించి కూడా అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా సుకుమార్ పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. పుష్ప సినిమాతో సుకుమార్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా దర్శకుడు సుకుమార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా సుకుమార్ చెప్పిన కథ షారుక్ ఖాన్ తో బాగా నచ్చడంతో వీరిద్దరూ త్వరలో సినిమా చేయబోతున్నారు అనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కనక నిజమైతే షారుక్ ఖాన్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..