Sanghavi Daughter: ఎంత అందంగా ఉందో.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్..
Sanghavi Daughter ఒకప్పుడు టాలీవుడ్ లో సందడి చేసిన అలనాటి స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సంఘవి కూడా ఒకరు. సంఘవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sanghavi Daughter: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంఘవి ఆ తర్వాత పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. కానీ అప్పుడప్పుడు సంఘవి బుల్లితెర మీద ప్రసారమయ్యే టీవీ షోలలో, ఈవెంట్లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. దక్షిణాది సినిమాలతో హీరోయిన్ సంఘవి తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ్, కన్నడలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. హీరోయిన్ సంఘవి తన 15 ఏళ్ల సినిమా కెరియర్ లో దాదాపు 80 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 1993 లో రిలీజ్ అయిన కొక్కొరొకో అనే తెలుగు సినిమాతో సంఘవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగులో తాజ్ మహల్, ఊరికి మొనగాడు, తాతా మనవడు, నాయుడుగారి కుటుంబం, సరదా బుల్లోడు, అబ్బాయిగారి పెళ్లి, సూర్యవంశం, సమరసింహారెడ్డి, సింధూరం, సీతారామరాజు, పిల్ల నచ్చింది, చిరంజీవులు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళ్ మరియు కన్నడలో కూడా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా సంఘవి ఆకట్టుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల మాదిరిగానే హీరోయిన్ సంఘవికి కూడా క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
సంఘవి 2016లో వెంకటేష్ అనే ఐటి ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సంఘవి చివరిసారిగా 2019లో రిలీజ్ అయిన కొలంజి అనే తమిళ సినిమాలో నటించింది. గత కొంతకాలం నుంచి సంఘవి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో సందడి చేస్తుంది. బుల్లితెర మీద ప్రచారం అవుతున్న ప్రముఖ టీవీ షో జబర్దస్త్ తో పాటు ఈమె పలు టీవీ షోలలో కనిపించింది. అలాగే పలు సినిమా ఈవెంట్లు మరియు ఫంక్షన్లలో కూడా సంఘవి సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం సంఘవి చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే సంఘవి తన భర్త మరియు కూతురుతో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీటిని చూసిన ఆమె అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సంఘవికి పెళ్లయిన తర్వాత చాలా కాలం వరకు సంతానం కలగలేదు. 2016 లో పెళ్లి చేసుకున్న సంఘవి 2020 చివరికి శాన్వి అనే కూతురికి జన్మనిచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 42 ఏళ్ళు. తన కూతురిని ఎంతో అల్లారం ముద్దుగా పెంచుతుంది సంఘవి.
View this post on Instagram
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా