Emergency: కంగనా ఎమర్జెన్సీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచంటే?

Emergency:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 17న రిలీజ్ అయ్యింది. అయితే ఎన్నో సార్లు రిలీజ్‌కి ముందు వివాదాల కారణంగా ఆలస్యంగా రిలీజ్ అయ్యి చివరకు జనవరిలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మిక్సిడ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో ఏ కొత్త సినిమా వచ్చినా కూడా తొందరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఈ ఎమర్జెన్సీ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు నటి కంగనా తెలిపారు. మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా వచ్చింది. రిలీజ్‌కి వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని బట్టి సినిమాను తీశారు. అయితే ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించింది. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో నటించారు. అలాగే మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మొత్తాన్ని రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీశారు. కానీ ఈ సినిమా మొత్తం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎమర్జెన్సీ మూవీ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఏ భాషలో రిలీజ్ అయినా కూడా ఓటీటీలోకి వచ్చినా కూడా తెలుగులో కూడా వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని రిలీజ్‌కి ముందే సమస్యలు వచ్చాయి. కొందరు సిక్కులు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే ఇందిరాకి ఓట్లు వేస్తాననే ఓ సన్నివేశం ట్రైలర్‌లో కనిపించింది. దీంతో సిక్కు సంస్థలు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆఖరికి సెన్సార్ బోర్డుకు కూడా లేఖలు రాశారు. ఎన్నో వివాదాలు దాటి చివరకు సినిమా జనవరి 17న రిలీజ్ అయ్యింది.