David Warner: వేదిక మీద నితిన్, శ్రీలీలతో కలిసి డాన్స్ చేసిన డేవిడ్ వార్నర్.. టాలీవుడ్ లో రాబిన్ హుడ్ సినిమాతో వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా..
David Warner క్రికెట్ లవర్స్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

David Warner: నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ హీరో నితిన్ మరియు హీరోయిన్ శ్రీ లీల తో కలిసి స్టెప్పులు వేసి ఫాన్స్ ను అలరించాడు. ఈ వేడుకలో డేవిడ్ వార్నర్ ఈ సినిమా షూటింగ్ అనుభవాన్ని చాలా ఆస్వాదించానని అలాగే మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఇక నితిన్ రాబిన్ హుడ్ ట్రైలర్ లో ఆయన మాస్ ఎంట్రీ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గతంలో చాలా సార్లు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయ సినిమాలపై తనకు అమితమైన ప్రేమను అనేక సందర్భాలలో ప్రదర్శించాడు. ముఖ్యంగా ఈయన కోవిడ్ 19 లాక్డౌన్ సమయంలో హిందీ మరియు దక్షిణ భారత పాటలకు డాన్స్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ తన తెలుగు సినిమా ఎంట్రీని రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రకటించినప్పుడు అభిమానులు పెద్దగా ఆశ్చర్యపోలేదని తెలుస్తుంది. రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మార్చి 23న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ నితిన్, శ్రీ లీల తో కలిసి వేదికపై సందడి చేశాడు. ఈ ఈవెంట్లో రాబిన్ హుడ్ హీరో నితిన్ మరియు హీరోయిన్ శ్రీ లీల తో కలిసి వార్నర్ వేదిక మీద డాన్స్ చేశాడు.
అయితే వార్నర్ తన సహ నటులు నితిన్ మరియు శ్రీ లీలతో స్టెప్పులను అనుకరించడానికి ప్రయత్నించాడు. కొంతవరకు సక్సెస్ అయిన తర్వాత డేవిడ్ వార్నర్ నితిన్, శ్రీ లీలతో కలిసి వేదికపై నవ్వుతూ డాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చేరుకున్న డేవిడ్ వార్నర్ కు అభిమానుల నుంచి భారీ స్వాగతం లభించింది. వార్నన్ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో గుమి కూడదంతో వార్నర్ అందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. అలాగే ఈ షూటింగ్ అనుభవం గురించి మాట్లాడిన వార్నర్ ఈ సినిమాకు పని చేయడం తనకు ఒక అద్భుతమైన అనుభవమని తెలిపాడు.
రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా మరియు ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్ చివరిలో డేవిడ్ వార్నర్ తన మాస్ ఎంట్రీ తో స్క్రీన్ ను ఊపేసాడు. ఇది చూసిన అభిమానులు వార్నర్ పాత్ర గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ గతవారం సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ ను స్వాగతిస్తూ భారతీయ సినిమాకు వారణాన్ని పరిచయం చేయడం మాకు చాలా గర్వంగా ఉంది అంటూ అలాగే మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ గ్రాండ్ విడుదల అంటూ పోస్ట్ చేశారు.
View this post on Instagram