Daaku Maharaaj: ఓటీటీలోకి డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Daaku Maharaaj:
డాకు మహారాజ్ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బాలకృష్ణ ప్రజల కష్టాలను తీరుస్తాడు. మంచి నీటి కోసం ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంటారు. వారి కష్టాలను తీర్చడానికి సివిల్ ఇంజనీర్‌గా వెళ్తాడు. అయితే గ్రానైట్ క్వారీలకి అడ్డు అవుతుందని ఓ పెద్ద కుటుంబం వారిని అడ్డుకుంటుంది. అయితే ఈ గ్రానైట్ ముసుగులో డ్రగ్స్ దందా జరుగుతుందని విషయాన్ని గుర్తిస్తాడు. అసలు ఆ దందాను ఎలా అడ్డుకుంటాడు? మంచి నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను ఎలా తీర్చాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. సినిమాకి ఈ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్క్‌వుట్ అయ్యింది. ఈ సినిమా హిట్‌తో బాలాకృష్ణ ఖాతాలో మరో హిట్ పడింది. సినిమా స్టోరీతో పాటు యాక్టింగ్ అన్ని కూడా అదిరిపోయాయి. తమన్ బీజీఎం అయితే చెప్పక్కర్లేదు. ఆ బీజీఎంకి థియేటర్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. మరో హిట్‌ను బాలయ్య తన ఖాతాలో వేసుకున్నాడు.