Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్ట్ మూవీ
Court Movie Collections : కోర్టు మూవీ పది రోజుల్లోనే ఈ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని కోర్టు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇంతటి గొప్ప సినిమాను ఆదరిస్తున్నా ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు అని క్యాప్షన్ ఇచ్చారు. మార్చి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే కలెక్షన్లు రాబట్టింది.

Court Movie Collections : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వహించిన తాజా సినిమా కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ (Court). ఈ సినిమా ఇటీవల బాక్సాఫీస్ (Box Office) దగ్గర హిట్ కొట్టడంతో పాటు మంచి కలెక్షన్లు (Collections) రాబట్టింది. కేవలం రూ.9 కోట్లతో తీసిన ఈ సినిమా మొదటి రోజే రూ.8 కోట్ల కలెక్షన్లు (Collections) రాబట్టింది. అయితే ఈ సినిమా మరో మైలురాయి చేరుకుంది. చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు రూ.50 కోట్ల క్లబ్‌లో (50 Crores Club) చేరింది.
కోర్టు మూవీ పది రోజుల్లోనే ఈ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని కోర్టు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇంతటి గొప్ప సినిమాను ఆదరిస్తున్నా ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు అని క్యాప్షన్ ఇచ్చారు. మార్చి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో రోషన్, శ్రీదేవి యాక్టింగ్ బాగుందని ప్రియదర్శి జీవించేశాడని నెటిజన్లు పొగిడారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం కూడా సూపర్‌గా ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా సెక్షన్లు తెలుసుకోవాలనే కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమాకి నిర్మాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించారు. కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ ఈ మూవీని తెరకెక్కించారు. కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శివాజీ మంగపతిగా నటించారు. ఇతని నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
కోర్ట్ బ్యాక్ డ్రాప్ అంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఈ క్రమంలో ఓ ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా చేస్తుండగా ఒక పెద్ద ఇంటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆ అమ్మాయి తండ్రి పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. దీంతో అమ్మాయి మామయ్య యువకుడిపై కేసులు పెడతాడు. ఎంతో కఠినమైన పోక్సో యాక్ట్‌తో పాటు మరికొన్ని కేసులు కూడా పెడతాడు. ఆ యువకుడిని జైలులో పెట్టిస్తాడు. ఈ సమయంలో ఆ యువకుడి కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. అప్పుడు ప్రియదర్శి ఆ కేసును తీసుకుంటారు. ఆ యువకుడి తరఫున కేసు వాదిస్తాడు. అయితే ఈ సినిమాలో ఆ యువకుడికి న్యాయం జరిగిందా? లాయర్ ఏ విధంగా వాదించాడు? ఎలా ఈ కేసు నుంచి బయటపడ్డాడనేది స్టోరీ.
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?