Bollywood Heroine: టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న కూడా బాలీవుడ్ వైపు వెళ్లిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…

Bollywood Heroine:
చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కలిసి వచ్చి అందుకుంటున్న కూడా బాలీవుడ్ వైపు మొగ్గు చూపిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ బ్యూటీ రేంజ్ అమౌంట్ పెరిగిపోయింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ హిట్స్ అందుకుంటూ స్టార్డం సంపాదించుకుంది. అభిమానులు సినిమా తారాల చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలు చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే కొంతమంది సినిమా సెలబ్రెటీలను వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ ద్వారా చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు.
కానీ కొంతమంది హీరోలు లేదా హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి గుర్తుపట్టలేము. ఈమె చిన్ననాటి సినిమాలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ హీరోయిన్ తెలుగు, తమిళ్, మలయాళం తోపాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఈ చిన్నది ప్రభాస్, రవితేజ, గోపీచంద్ వంటి హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ. ఇటీవల ఈ అమ్మడు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను. టాలీవుడ్ లో తాప్సి ఝుమ్మంది నాదం అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే తన అందంతో అందరిని ఆకట్టుకొని మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత తాప్సి కు తెలుగులో వరుసగా అవకాశాలు చేపట్టాయి. అనేక ఆఫర్ల తో తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు జోడిగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించి అలరించింది. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన తాప్సి ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది. మలయాళం లో కూడా ఈ అమ్మడు వరుసగా అవకాశాలను అందుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా తాప్సీ పన్ను మొదట తన కెరీర్ ను మోడలింగ్ రంగంలో స్టార్ట్ చేసింది.
కెరియర్ స్టార్టింగ్ లో ఆమె రిలయన్స్ ట్రెండ్స్, కోకా కోలా, ఎయిర్టెల్, రెడ్ ఎఫ్ఎం, పివిఆర్ సినిమాస్ వంటి బ్రాండ్లకు యాడ్లలో నటించింది. తాప్సి ఆడుకలం అనే సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాకు గాను తాప్సి 6 జాతీయ అవార్డులను అందుకుంది. ఈమె నటించిన సినిమాలలో పింక్, ముల్క్, బద్ల, గేమ్ ఓవర్, మిషన్ మంగల్, తప్పడు, షారుఖ్ ఖాన్ తో కలిసి డంకి సినిమాలలో నటించింది. కొన్నాళ్ల క్రితం తాప్సి పన్ను డానిష్ బ్యాట్మెంటన్ మసియాస్ బోను వివాహం చేసుకుంది.
View this post on Instagram
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Bollywood Heroine : హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్.. కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటుంది…ఎవరంటే..
-
Bollywood Heroine : త్వరలో రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన బ్యూటీ..
-
Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..