Allu Arjun: అల్లు అర్జున్ తో జతకట్టనున్న బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఎవరంటే?

Allu Arjun:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని రోజుల వరకు జైలు, కేసు అంటూ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరో సినిమా గురించి వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని మరోసారి కూడా త్రివిక్రమ్ తోనే చేయబోతున్నారు అని టాక్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం మార్చుకొని మరొక డైరెక్టర్ తో కమిట్ అయ్యారట. ఇక ఈ సినిమాలో ఓ స్టార్ నటి కూడా తోడైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఐకాన్ స్టార్ కు గతేడాదితో పాటు పుష్ప సినిమా కూడా బాగా కలిసి వచ్చింది. పార్ట్ 1,2 లు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. పుష్ప 2 ఏకంగా రూ. 2 వేల కోట్లకు పైగా కలెక్షన్ చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఫ్యూచర్ ఏంటి? ఆ తరహాలో మూవీని అందించే డైరెక్టర్ ఎవరు? అంటూ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరో మరో సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పని చేయబోతున్నారు అనే టాక్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందట. అందుకే ఈ సినిమాను పక్కన పెట్టి మరో ప్రముఖ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు.
దర్శకుడు అట్లీ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అందాల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. అయితే చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హై యాక్షన్ సినిమా రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు చిత్ర యూనిట్.
బన్నితో బాలీవుడ్ బ్యూటీ..
రీసెంట్ గా దేవర సినిమాలో జూ. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జతకట్టి మంచి హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ జాన్వీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. మరి సెకండ్ పాత్రలో అయినా ఈ బ్యూటీకి ప్రాధాన్యత ఉంటుందో లేదో అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఇప్పుడు అల్లు అర్జున్ తో జతకట్టునుంది జాన్వీ. అయితే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా జాన్వీ నటిస్తుంది. ఇక నాని హీరోగా రాబోతున్న మరో సినిమాలో కూడా ఈ బ్యూటీ కన్ఫర్మ్ అయిందని టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ తో జాన్వీ అనే టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్గా ప్రియాంక?
-
Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా