Bollywood Actress : పాన్ ఇండియా స్టార్ కి తల్లిగా, బాలీవుడ్ హీరో కి ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస్తా.. ఈమె ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bollywood Actress :
తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ తన భర్త మరియు పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఏజ్ తెలిసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ బాగా గుర్తుండిపోతాయి. నటీనటులకు కూడా వాళ్ళు యాడ్ చేసిన సినిమాలు కొన్ని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోతాయి. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. సినిమా పేరు చెప్తే ఆ హీరోయిన్లే గుర్తుకు వస్తారు. ఈ విధంగానే హీరోయిన్ భాగ్యశ్రీ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా మైనే ప్యార్ కియా. ఈ సినిమా భాగ్యశ్రీ కెరియర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మైనే ప్యార్ కియా సినిమాలో భాగ్యశ్రీ హీరో సల్మాన్ ఖాన్ కి ప్రియురాలి పాత్రలో నటించింది. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. రీసెంట్గా భాగ్యశ్రీ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఈమె తాజాగా తన 56వ పుట్టినరోజులు జరుపుకుంది. ముంబైలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలై దస్సాని, అలాగే పిల్లలు అభిమన్యుధసాన్ని, అవంతిక దస్సాని కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకుంది. కొన్ని రోజులకు భాగ్యశ్రీ తన పుట్టినరోజు వేడుకను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.
56 ఏళ్ల వయసులో కూడా ఇంకా హీరోయిన్ లాగానే ఉన్నావు అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలో భాగ్యశ్రీ తన భర్త హిమాలయ దస్సాని తో కలిసి కేక్ ను కట్ చేసింది. అలాగే తన కుమారుడు అభిమన్యు తన వెనకాలే నిలబడి ఉన్న వీడియో కారో సెల్ ప్రారంభమైంది. ఆమె స్నేహితులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత భాగ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా భాగ్యశ్రీ తన ఫ్యామిలీ, పర్సనల్, వెకేషన్, టూర్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముంబైలోని తన ఇంట్లోనే భాగ్యశ్రీ తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఈ వేడుకలో భాగ్యశ్రీ అద్భుతమైన పూల నీలం రంగు దుస్తులను ధరించింది.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ భాగ్యశ్రీ ప్రత్యేక వ్యక్తులతో ప్రత్యేక క్షణాలు మీ వెచ్చదనం, ప్రేమ మరియు ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చూడడానికి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా భాగ్యశ్రీ హీరోయిన్ గా యాక్టింగ్ చేసే అంత కుర్ర హీరోయిన్ లాగా కనిపిస్తుంది. ఈమె సినిమాల లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భాగ్యశ్రీ ఉద్వేగ భరితమైన ఫిట్నెస్ అభిమాని కూడా. ఈమె తరచుగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో చిట్కాలు, వ్యూహాలు పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ పాన్ ఇండియా స్టార్ అయినా హీరో ప్రభాస్ కు రాధేశాం సినిమాలో తల్లిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.