Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
Spirit డైరెక్టర్ సందీప్ వంగా ఇటీవల యూఎస్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సందీప్ వంగా మాట్లాడుతూ.. మెక్సికోలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

Spirit: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో స్పిరిట్ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాపై రోజురోజుకి హైప్ పెరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డే్డ్ కూడా రాలేదు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా ప్రారంభించలేదు. సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే భారీగా అంచనాలు ఉంటాయి. దీనికి తోడు సందీప్ వంగా డైరెక్టర్ అన్నా కూడా ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. వేర్వేరుగా వీరిద్దరి సినిమాలు అంటే అసలు చెప్పక్కర్లేదు. అలాంటిది వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటే.. మాత్రం సినిమాపై చెప్పలేనన్ని అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఇటీవల విడుదలై మంచి హిట్‌ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దీని తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ సినిమాపై ఫ్యాన్స్ బాగా అంచనాలు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో స్పిరిట్ మూవీ ప్రస్తుతం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.
డైరెక్టర్ సందీప్ వంగా ఇటీవల యూఎస్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సందీప్ వంగా మాట్లాడుతూ.. మెక్సికోలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు. అక్కడ మంచి లొకేషన్స్ కోసం వెతుకుతున్నామని, త్వరలో అక్కడే షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఓ ఫారెన్ పోలీస్‌గా కనిపిస్తారని అంటున్నారు. మెక్సికో బ్యాక్‌డ్రాప్‌లో షూటింగ్ చేస్తున్నారంటే.. ఇంటర్నేషనల్ యాక్షన్ ఎలిమెం ఎక్కువగా ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. అయితే సందీప్ వంగా గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ స్పిరిట్ మూవీ పూర్తిగా డిఫరెంట్ స్టోరీ. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఉండే స్టోరీ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. మరి ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తాడో చూడాలి.
స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా ఎవరిని ఫిక్స్ చేశారనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాలో కత్రినా కైఫ్, రష్మిక మందన్నాను హీరోయిన్‌గా తీసుకోవాలని పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సందీప్ వంగా ఇంకా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా షూటింగ్ మొదలైన తర్వాత అన్ని కూడా బయటకు వస్తాయని తెలుస్తోంది. సినిమా స్టోరీ దేని మీద ఉండబోతుందో కూడా తెలుస్తుందని సమాచారం. ఏదైనా అప్‌డేట్ కోసం తెలియాలంటే మూవీ టీం ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా
-
Crazy Tollywood Heroine: ఎంబీబీఎస్ ఎగ్జామ్ కోసం మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా…