Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా
Atlee Allu Arjun Movie అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను తీసుకోవాలని అట్లీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే దర్శకుడు అట్లీ చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది.

Atlee Allu Arjun Movie: పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను తీసుకోవాలని అట్లీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే దర్శకుడు అట్లీ చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో అట్లీ కి కూడా బాగా డిమాండ్ ఉంది. లేటెస్ట్ గా దర్శకుడు అట్లీ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాతో భారీ విజయం సాధించి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అట్లీ తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడిగా హీరోయిన్ ఎంపిక విషయంలో అట్లీ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రియాంక చోప్రా గత కొన్ని ఏళ్ల నుంచి హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
గత కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం తొలిసారిగా ఒక తెలుగు సినిమాలో నటిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రియాంక చోప్రా అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించే అవకాశం ఉందని కూడా టాక్. అల్లు అర్జున్తో సినిమా అంటే దర్శకుడు అట్లీకి కఠిన సవాల్ అని తెలుస్తుంది.
View this post on Instagram
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్గా ప్రియాంక?
-
Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్