Allu Arjun-Trivikram Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. త్రివిక్రమ్, బన్నీ మూవీ ఎప్పుడో రివిల్ చేసిన నిర్మాత

Allu Arjun-Trivikram Movie:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ భారీ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించే ఏ షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. త్వరలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం కాదని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందనే దాంట్లో నిజం ఉందా అని రిపోర్టర్ నాగ వంశీని అడగ్గా.. ఇప్పట్లో షూటింగ్ ప్రారంభం కాదని క్లారిటీ ఇచ్చారు.
ఈ సమయంలో బన్ని అట్లీతో ఓ సినిమా చేయవచ్చు. దీని తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందని నాగవంశీ అన్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి సినిమా రాలేదన్నారు. అయితే ఈ సినిమా కోసం అల్లు అరవింద్ ఇంకా ఇన్వెస్టర్లను వెతుకుతున్నట్లు తెలిపారు. గురూజీ ఈసారి హిట్ కొడతారని, మైథాలజీ బ్యాక్ డ్రాప్ సినిమా తీస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా మైథాలజీపై త్రివిక్రమ్‌కి బాగా అవగాహన ఉంది.
తన సినిమాలు చూస్తేనే ఈ విషయం అర్థం అయిపోతుంది. ప్రతి సినిమాలో కూడా రామాయణ, మహాభారతంలోని కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అలాంటిది సినిమా మొత్తం ఈ జోనర్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా నాగ వంశీ మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్‌లో మరో క్లారిటీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు అనుకున్న సమయానికి రిలీజ్ అయితే మాత్రమే మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కాదన్నారు. అయితే మార్చి 28వ తేదీకి హరి హర వీరమల్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. ఆ సినిమా వస్తే పక్కాగా.. మ్యాడ్ స్క్వేర్ పోస్ట్ పోన్ అవుతుందని నాగవంశీ అన్నారు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది. మార్చి 29వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.
-
Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ
-
Peddi Movie: RC16 సినిమా టైటిల్ ఫిక్స్.. రామ్ చరణ్ లుక్ గూస్ బంప్స్
-
Mad square trailer: లడ్డు గాని పెళ్లి ఆపేద్దాం.. నవ్వులు పూయిస్తున్న మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్
-
APPSC : ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి
-
Mad Square: ఓవర్సీస్ లో మొదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మేనియా..బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!