Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున అసలు పేరు ఇదే.. పేరు వెనుక ఇంత స్టోరీ ఉందా?

Akkineni Nagarjuna:
అక్కినేని నాగార్జున అగ్ర కథానాయకుల్లో ఒకరు. తన నటనతో కింగ్ అనిపించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా వచ్చినా కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత కింగ్ నాగార్జునగా మారారు. సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, కన్ స్ట్రక్షన్స్, కన్వెన్షన్స్ ఇలా పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తున్నారు. స్టార్ హీరోగా ఎదగడంతో పాటు వ్యాపారవేత్తగా కూడా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున కెరీర్‌లో శివ సినిమా తన కెరీర్‌ను మార్చేసింది.
ఈ సినిమాతో అతనిని పలు ఆఫర్లు వరించాయి. ఆ తర్వాత మన్మధుడు, సంతోషం ఇలా మంచి హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్‌కు కూడా హోస్ట్‌గా చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ కూడా నాగార్జున పలు సినిమాల్లో నటిస్తున్నారు. కానీ సరైన హిట్ అయితే పడటం లేదు. నాగార్జున ప్రస్తుతం ధనుష్ కుబేర, రజనీకాంత్ కూలీ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగా కనిపించినా నాగార్జున ఫస్ట్ టైం విలన్‌గా కూలీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత తన 100వ సినిమా కూడా చేయనున్నారు.
ఇదిలా ఉండగా నాగార్జునను అందరూ కూడా ఆ పేరుతోనే పిలుస్తారు. లేదా కింగ్, మన్మధుడు అని పిలుస్తుంటారు. అయితే చాలా మందికి నాగార్జున అసల పేరు సరిగ్గా తెలియదు. ఇదే నాగార్జన ఒరిజినల్ పేరు అని అనుకుంటారు. నాగార్జున అసలు పేరు నాగార్జున సాగర్. అక్కినేని నాగేశ్వరరావుకి చిన్న కొడుకు అయిన నాగార్జునకు ఈ పేరు పెట్టారు. అయితే ఈ పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. నాగార్జున సరిగ్గా నాగార్జున సాగర్ నిర్మించిన టైంలో పుట్టాడు. ఇది పెద్ద మానవ నిర్మిత మహా సాగరం. ఇలాంటి ఆనకట్టను నిర్మించడంతో నాగేశ్వరరావు నాగార్జునకి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాగార్జున పేరు చివరలో ఉన్న సాగర్‌ను తీసేసి.. కేవలం నాగార్జున అని ఉంచుకున్నారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగార్జున ఈ పేరుతో కొనసాగుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరికి నాగార్జున ఒరిజినల్ పేరు తెలియదు. ఇప్పుడు నాగార్జున ఒరిజినల్ పేరు తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతున్నారు. నాగేశ్వరరరావు ఎంతో బాగా ఈ పేరును పెట్టారని ప్రశంసిస్తున్నారు.