Metro Pillar : మెట్రో పిల్లర్లకు నంబర్లు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

Metro Pillar : మెట్రోలో రోజూ ఎంతో మంది ప్రయాణిస్తున్నారు. పట్టణాల్లో అయితే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది మెట్రో ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఎక్కువగా మెట్రోనే వాడుతారు. అయితే కేవలం మెట్రోలో (Metro) ప్రయాణించే వారు మాత్రమే కాదు.. మెట్రోలో ప్రయాణించని వారు కూడా మెట్రో గురించి తెలుసుకుంటారు. ఎలాగంటే మెట్రో (Metro) ఉన్న నగరాల్లో అయితే ఎవరైనా ఎక్కడైనా ఉన్నావంటే ఏదో షాప్ అడ్రస్ అలా సరిగ్గా చెప్పకుండా మెట్రో పిల్లర్ (Metro) దగ్గర ఉన్నా అని చెబుతుంటారు. అయితే అన్ని మెట్రో పిల్లర్లు (Metro Pillar) కూడా ఒకేలా ఉంటాయి కదా.. ఎలా గుర్తుపడతారనే డౌట్ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ప్రతీ మెట్రో పిల్లర్‌కు (Metro Pillar) ఒక నంబర్ ఉంటుంది. అసలు మెట్రో పిల్లర్లకు నంబర్లు ఎందుకు ఉంటాయనే డౌట్ మీలో ఎప్పుడైనా వచ్చిందా? అసలు మెట్రో పిల్లర్లకు నంబర్లు ఉండటానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోజుకి లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, నాగ్‌పూర్ ఇలా చాలా దగ్గర మెట్రో ఉంది. అయితే మెట్రో పిల్లర్లకు నంబర్లు పెడతారనే విషయం మాత్రం సరిగ్గా తెలియదు. అయితే మెట్రో పిల్లర్లకు నంబర్లు పెట్టడానికి ఓ కారణం ఉంది. ఎందుకంటే వీటిని తయారు చేసేటప్పుడు ఎక్కువ మంది ఉంటారు. దీనివల్ల చాలా మంది మిస్ అవుతారు. ఎవరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని కనుక్కోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఇలా నంబర్లు ఉంటే ఈజీగా గుర్తు పట్టవచ్చనే ఉద్దేశంతో మెట్రో పిల్లలర్లకు నంబర్లు వేశారు. ఈ పిల్లర్ల నంబర్లను కార్మికులకు సంకేతాలుగా భావిస్తారు. ఈ కారణం వల్లనే ఎక్కువగా మెట్రో పిల్లర్లకు నంబర్లు వేస్తారు. వీటివల్ల కేవలం కార్మికులకు మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా ఈ మెట్రో పిల్లర్లు బాగా ఉపయోగపడతాయి. ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చినా లేదా వారిని కలిసినా కూడా ఈజీగా గుర్తు పట్టడానికి ఇవి ఉపయోగపడతాయి.
దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాల్లో కూడా పిల్లర్లకు ఈ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా మీరు ఈజీగా ఇతరులను గుర్తించవచ్చు. అలాగే ఎవరిని అయినా కూడా ఈ మెట్రో పిల్లర్ దగ్గర ఉండండని ఈజీగా చెప్పవచ్చు. వారు కూడా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెట్రోలో ఎందరో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఇందులో ప్రయాణించడం వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. అలాగే గమ్య స్థానాన్ని కూడా తొందరగా చేరవచ్చు. ఎక్కువ సమయం జర్నీ కాకుండా చాలా తక్కువ సమయం ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కడికైనా కూడా ఎలాంటి శ్రమ లేకుండా వెళ్లవచ్చు. రోడ్డు మీద ప్రయాణిస్తే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దీంతో చాలా ఇబ్బంది పడతారు.