Study Tips: చదివింది గుర్తు ఉండాలంటే.. ఈ దిశలో కూర్చోవాల్సిందే
Study Tips మీరు చదివేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి చదివితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఉత్తరం వైపు తిరిగి చదివితే జ్ఞానం పెరుగుతుంది. చదివినది అంతా కూడా గుర్తు ఉంటుంది.

Study Tips: కొందరు వాస్తు నియమాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా చదువు విషయంలో కూడా పాటిస్తుంటారు. అయితే కొందరు కాస్త చదివితే చాలు గుర్తు ఉంటుంది. కానీ మరికొందరికి మాత్రం ఎన్నిసార్లు చదివినా కూడా గుర్తు ఉండదు. కేవలం వారి జ్ఞాపకశక్తి అని కొందరు అనుకుంటారు. కానీ కొన్ని వాస్తు నియమాల బట్టి కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఒక ప్లేస్‌లో ఉండి చదివితే సరిపోదు. చుట్టు ఉండే పరిసరాల బట్టి కూడా మనం చదివింది గుర్తు ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే చదివేటప్పుడు కొందరు సరైన దిశలో కూర్చోకపోవడం వల్ల గుర్తు ఉండదు. అయితే ఏ దిశలో కూర్చోని చదవడం వల్ల అన్ని గుర్తు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఉత్తరం వైపు
మీరు చదివేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి చదివితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఉత్తరం వైపు తిరిగి చదివితే జ్ఞానం పెరుగుతుంది. చదివినది అంతా కూడా గుర్తు ఉంటుంది. ఈ దిశ మీ ఏకాగ్రతని కూడా పెంచుతుంది. చదువుపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేస్తుంది. అలాగే చదివినది గుర్తు ఉండేలా చేస్తుంది. దీంతో మీకు ఎక్కువ మార్కులు కూడా వస్తాయని విద్యార్థులు చదువులో ఫస్ట్ ఉంటారని పండితులు చెబుతున్నారు.
తూర్పు వైపు
ఈ దిశలో కూర్చోని చదివితే పాజిటివ్ పెరుగుతుంది. మీకు చదవాలనే ఇంట్రెస్ట్ రోజురోజుకీ పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీంతో మీరు డైలీ తప్పకుండా చదువుతారు. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు చదివింది మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటారు.
ఈశాన్యం వైపు
ఈ దిశలో కూర్చోని చదవడం వల్ల దేవుని అనుగ్రహం కలుగుతుంది. మీరు చదివిన ప్రతీది కూడా గుర్తు ఉంటుంది. అసలు మరిచిపోలేరు. అలాగే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులు అన్నింట్లో కూడా రాణిస్తారు.
పడమర వైపు
ఈ దిశలో కూర్చోని చదివితే అంతగా ఫలితాలు ఉండవు. కాకపోతే ఉత్తరం, తూర్పు, ఈశాన్యం వైపు కుదరకపోతేనే ఈ దిశలో కూర్చోవాలని పండితులు చెబుతున్నారు. అయితే చదివేటప్పుడు గది మొత్తం శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మీరు చదివింది గుర్తు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
దక్షిణం వైపు
ఈ దిశలో కూర్చోని చదివితే అసలు గుర్తు ఉండదు. అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ దిశలో అసలు కూర్చోని చదవద్దు. దీనివల్ల మీకు చదివింది గుర్తు ఉండదు. అనేక సమస్యలు వస్తాయి. మీకు మతిమరుపు కూడా వస్తుంది. చదువు మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఎంత కష్టపడి చదివినా కూడా ప్రతిఫలం ఉండదు. తొందరగా మరిచిపోతారు. కాబట్టి ఈ దిశలో కూర్చోని అసలు చదవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.