Gurukula Schools: రేవంత్ సర్కార్ను కడిగేసిన గురుకుల బాలిక.. ఈమె ప్రశ్నలకు అధికారులే నెవ్వెరపోయారు.. వైరల్ అవుతున్న వీడియో
Gurukula Schools: చదువు చాలా భయంకరంగా మారుతున్న రోజులు ఇవి. ఇక ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలను పంపాలంటే కచ్చితంగా ఆస్తులు అమ్మాల్సిందే అనే రేంజ్ లో ఉంటున్నాయి ఫీజులు.

Gurukula Schools:
చదువు చాలా భయంకరంగా మారుతున్న రోజులు ఇవి. ఇక ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలను పంపాలంటే కచ్చితంగా ఆస్తులు అమ్మాల్సిందే అనే రేంజ్ లో ఉంటున్నాయి ఫీజులు. చిన్న పిల్లలకు కూడా లక్షల ఫీజులు ఉంటున్నాయి. బస్ ఫీజు, స్కూల్ డ్రెస్, మధ్యమధ్యలో ప్రోగ్రామ్స్ కు స్పెషల్ ఫీజులు అంటూ దండేసుకుంటున్నారు స్కూల్ యాజమాన్యాలు. ఇన్ని తలనొప్పుల మధ్య పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే అక్కడ చదువు చెప్పే టీచర్ల గురించి ఆలోచించాల్సి వస్తుంది.
సరిగ్గా చదువు ఉండటం లేదు. ఇక భోజనం విషయంలో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాల్లో తల్లిదండ్రులు, పిల్లలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అడిగితే ఎక్కడ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలా మంది భయపడుతున్నారు. మాకెందుకు లే అని ఆగిపోతున్నారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవన్నింటిని పక్కన పెట్టి ఓ అధికారినికి చుక్కలు చూపించారు. ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ వారి హక్కులను వారు పొందాలి అనుకున్నారు.
అయితే గురుకుల పాఠశాలల్లో చదువు గురించి పక్కన పెడితే ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అయితే ఓ స్కూల్ లో పిల్లలు వారి సమస్యల కోసం రోడ్డెక్కారు. పెద్దవారు సహాయం చేసినా చేయకున్నా పిల్లలందరూ కలిసి కట్టుగా కూర్చొని ధర్నా చేశారు. అయితే ఓ అధికారిని అక్కడికి వస్తే ఆమెను ప్రశ్నించారు. మా చదువులు బాగుండటం లేదు. మీరు వెళ్లిన తర్వాత టీచర్లు తిడతారు అని చెబుతూనే ప్రతి అవసరాన్ని చెప్పారు. ఆ అధికారిని వేసిన ఏ ప్రశ్నకు కూడా వారు భయపడకుండా సమాధానం చెబుతూ ధైర్యాన్ని ప్రదర్శించారు.
మా సమస్యలు చెబితే టీచర్లు తిడతారని చదవు బాగుండటం లేదని చదువులు బాగా చెప్పడం లేదని నిలదీశారు పిల్లలు. వచ్చిన అధికారిని వారు చాలా కష్టపడి వచ్చారని అంటే మరి అలాంటప్పుడు బాగా చదువు చెప్పాలి కదా అని మాటకు మాట తూటాలు వదిలారు. అంతేకాదు వారికి ఫుడ్ పెట్టడానికి బడ్జెట్ లేదని సమాధానం చెప్పింది. అయినా ఆ అధికారిని సమాధానాలు విన్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు వారికి కావాల్సిన చదువును అడుగుతుంటే ఈమె ఏంటి బడ్జెట్ లేదు అంటుంది? నీ పని అది సో బడ్జెట్ కోసం నువ్వు కొట్లాడు అంటూ చివాట్లు పెడుతున్నారు.
పిల్లలు అంటే ఇలాగే ఉండాలని వారి హక్కులను వారు అడిగి పొందాలని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇలాంటి అదికారినిలు ఉంటే మాత్రం సిస్టమ్ బాగుండదని ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో కూడా ఈమెకు తెలియదని ఈమె డ్యూటీ చేయడం కంటే ఇంట్లో ఉండటం బెటర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.