Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా.. ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి
Loan: ఉన్నత చదువులు చదవాలని చాలా మంది అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద చదువులు (Higher Studies) చదవాలంటే తప్పకుండా డబ్బులు కావాలి.

Loan: ఉన్నత చదువులు చదవాలని చాలా మంది అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద చదువులు (Higher Studies) చదవాలంటే తప్పకుండా డబ్బులు కావాలి. మన దేశంలో చాలా మంది డబ్బులు లేక చదువుకోకుండా ఉండిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే విద్య కోసం కొన్ని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఎవరైనా ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారు ఎడ్యుకేషన్ లోన్ పెట్టి చదువుకోవచ్చు. చదువుకు (Education) అవసరమయ్యే ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, అధ్యయన సామగ్రి వంటి ఖర్చులకు ఈ లోన్ (Loan) బాగా ఉపయోగపడుతుంది. ఈ లోన్ వల్ల చాలా మంది విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. అయితే ఉన్నత చదువులకు కావాల్సిన ఫీజు బట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ లోన్‌ను తీర్చవచ్చు. అయితే ఎవరైనా సరే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గ్రేస్ పీరియడ్
కోర్సు పూర్తి అయిన తర్వాతే రుణాలు చెల్లించాలి. అయితే రుణం చెల్లింపుల కోసం గ్రేస్ పీరియడ్ ఉందో లేదో చూసుకోవాలి. మీరు ఉపాధిని పొందిన తర్వాత డబ్బులు చెల్లించే వ్యవధిని పెంచుకోవచ్చు. అప్పుడే మీకు ఎలాంటి సమస్య ఉండదు.
వడ్డీ రేటు
ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేట్లను ఇస్తాయి. మార్కెట్‌ను బట్టి కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా మారుస్తాయి. కాబట్టి
వడ్డీ రేటును ముందుగానే మీరు క్లియర్‌గా మాట్లాడుకోవాలి.
షరతులు బాగా చదవాలి
ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు అన్ని నిబంధనలను కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని షరతులను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి.
పన్ను విషయం
మిగతా లోన్ల కంటే.. ఎడ్యుకేషన్ లోన్ వేరేగా ఉంటుంది. విద్యార్థులు రుణం తీసుకున్న తర్వాత చెల్లించడానికి సెక్షన్ 80 కింద మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఈ రూల్ ఉందో లేదో చూసుకోండి.
గరిష్ట కాలం చూసుకోండి
మీరు చదువు కోసం ఒక రూ.50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బులు తిరిగి చెల్లించడానికి గరిష్ట సమయం ఎంతో తెలుసుకోండి. ఎందుకంటే రిపేమెంట్ షెడ్యూల్ వల్ల బ్యాంకులు, చెల్లింపుల బట్టి మారిపోతాయి. కాబట్టి గరిష్టంగా 15 ఏళ్లు పెట్టుకుంటే బెటర్.
ఉద్యోగం వచ్చిన తర్వాత
ఉద్యోగం వచ్చిన తర్వాతే రుణం చెల్లించేలా రూల్ పెట్టుకోండి. అప్పుడే మీకు ఎలాంటి సమస్య కూడా ఉండదు. లేకపోతే మళ్లీ మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.