Best Courses After Intermediate: ఇంటర్ తర్వాత ఈ పరీక్షలు రాస్తే.. కెరీర్లో టాప్ మీరే
Best Courses After Intermediate ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ టీఐలు, స్టేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర భాగస్వామ్య సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిన రాయడం వల్ల మంచి కాలేజీలో సీట్ వస్తే.. లైఫ్ సెట్ అయినట్లే.

Best Courses After Intermediate: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలు ముగిశాయి. చాలా మంది విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైనది. నిజానికి ఈ సమయంలో విద్యార్థులకు చాలా టెన్షన్ ఉంటుంది. ఏం చేయాలో కూడా సరిగ్గా తోచదు. ఎందుకంటే భవిష్యత్తులో స్థిర పడాలంటే గొప్పగా ఉండాలి. ఇంటర్ తర్వాత సరైన ప్లాన్ చేస్తేనే బాగుంటుంది. కొందరికి భవిష్యత్తు గురించి చెప్పేవాళ్లు ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని గురించి పెద్దగా అవగాహన లేని వారికి కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. చాలా మంది ఇంటర్ డిగ్రీ లేదా ఎమ్సెట్ రాసి ఏదో ఒక కాలేజ్‌ల ఇంజినీరింగ్ చదువుతారు. ఇలాంటి కాలేజీల్లో చదవినా కూడా ఉద్యగ పరంగా పెద్దగా అవకాశాలు ఉండవు. అయితే ఇంటర్ తర్వాత విద్యార్థులు మంచి కాలేజీల్లో చదవాలి. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిని తప్పకుండా రాస్తే మాత్రం ఇంజినీరింగ్‌లో మంచి టెక్నాలజీ కోర్సులు చేయవచ్చు. వీటిని చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ప్యాకేజీలు కూడా లభిస్తాయి. మరి ఆ పరీక్షలేంటో చూద్దాం.
జేఈఈ మెయిన్- పేపర్-1
ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ టీఐలు, స్టేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర భాగస్వామ్య సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిన రాయడం వల్ల మంచి కాలేజీలో సీట్ వస్తే.. లైఫ్ సెట్ అయినట్లే.
జేఈఈ అడ్వాన్స్డ్
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశానికి ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు.
బిట్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్ వంటి క్యాంపస్‌లో బీఈలో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్
ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో బీటెక్ చదివేందుకు ఈ పరీక్ష రాయాలి. ఇందులో సెలక్ట్ అయితే బీటెక్ చేశాక మంచి ప్యాకేజీ డబ్బులు వస్తాయి.
వీఐటీ-ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్రాంచ్‌ల్లో బీటెక్ ప్రవేశానికి ఈ పరీక్ష రాస్తారు. ఇందులో సెలక్ట్ అయితే మంచి కాలేజీలో అడ్మిషన్ రావడంతో పాటు ప్లేస్‌మెంట్స్ కూడా ఉంటాయి.
ఏపీ-ఈఏపీసెట్
ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్ కళాశాలల్లోని అన్ని బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ-ఈఏపీసెట్ (ఈ కేటగిరీ) (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను రాయాల్సి ఉంటుంది.
ఎంహెచ్‌టీ-సీఈటీ
మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ, అన్ని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ, B.Tech ప్రవేశానికి ఎంహెచ్‌టీ-సీఈటీ ఎంట్రాన్స్ పరీక్షను నిర్వహిస్తారు.
కేఐఐటీ భువనేశ్వర్
బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి కేఐఐటీ ఈఈ ఎంట్రాన్స్ పరీక్షలు రాయాల్సి వస్తుంది.