Appsc group 2 mains: గ్రూప్-2 మెయిన్స్ ఇనిషియల్ కి విడుదల.. చెక్ చేసుకోవడం ఎలా అంటే?

Appsc group 2 mains:
ఏపీలో అనేక పరిణామాల తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పరీక్షను నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ పరీక్షను సాయంత్రం వరకు నిర్వహించారు. గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1ను ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించారు. మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెయిన్స్ పేపర్-2 ను నిర్వహించారు. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు శాతం బాగానే ఉంది. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్‌కి అర్హత సాధించారు. అయితే వీరిలో 86,459 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే దాదాపుగా 92 శాతం పరీక్షకు హాజరు అయినట్లే. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష సమయానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లిన వారిని సెంటర్ అధికారులు అనుమతించలేదు. వారిని బయటకు పంపేశారు. రాష్ట్రంలో చాలా ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష అయితే ముగిసింది. అయితే పరీక్ష రాసిన అభ్యర్థులు చాలా ఆందోళనతో ఉంటారు. ఎన్ని మార్కులు వస్తాయని, ఆ కీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన కీని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు ఎలా పరీక్ష రాశారనే విషయాన్ని ఈ కీ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిపై ఏవైనా సందేహాలు ఉంటే https://psc.ap.gov.in/ ద్వారా అభ్యర్థులు తెలియజేయవచ్చు. అయితే వీటిని ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీలోపు మాత్రమే తెలియజేయాలని తెలిపింది. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించరని, వాయిదా పడిందని శనివారం వార్తలు వచ్చాయి. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లను నిర్ధారించడాన్ని కొందరు అభ్యర్థులు వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 23న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్లు కూడా వేశారు. అయితే వీటిని కోర్టు తిరస్కరించి పరీక్ష జరుగుతుందని తెలిపింది. అయినా కూడా అభ్యర్థులు తగ్గకుండా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పరీక్ష వాయిదా కన్ఫార్మ్ అని అన్నారు. కానీ చివరి నిమిషంలో ఏపీపీఎస్సీ యథావిధంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. దీంతో దీనిపై ఉన్న టెన్షన్ వీడింది. పరీక్ష వాయిదా పడుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో పరీక్ష జరిగింది.