AP Law Cet 2025: ఏపీ లాసెట్ నోటిఫికేషన్ రిలీజ్.. పరీక్ష ఎప్పుడంటే?
AP Law Cet 2025: ఏపీలోని లాసెట్ 2025 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు, ఐదేళ్ల పాటు పీజీ కోర్సులో చేరవచ్చు. అయితే ఈ ఏడాది ఈ పరీక్ష బాధ్యతలు అన్నింటిని కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ చూస్తున్నది. అయితే ఈ లాసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 22న ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

AP Law Cet 2025 : చాలా మంది న్యాయవాద వృత్తిని అభ్యసించాలని కోరుకుంటారు. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా చదవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది డిఫరెంట్‌గా, తక్కువ మంది మాత్రమే విద్యను అభ్యసించే వారు న్యాయవాది వృత్తిని చదవాలని అనుకుంటారు. అయితే ఇలా న్యాయవాది వృత్తిని చదవాలంటే మాత్రం తప్పకుండా దానికి సంబంధించిన పరీక్షలు రాయాలి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఏపీలోని లాసెట్ 2025 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు, ఐదేళ్ల పాటు పీజీ కోర్సులో చేరవచ్చు. అయితే ఈ ఏడాది ఈ పరీక్ష బాధ్యతలు అన్నింటిని కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ చూస్తున్నది. అయితే ఈ లాసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 22న ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉన్న వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇంట్రెస్ట్‌తో పాటు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో అయితే ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఏప్రిల్ 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షను జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. అయితే ఈ లాసెట్ పీజీకి అప్లై చేసుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అంటే 45 శాతం మార్కులతో తప్పకుండా ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినా చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే పీజీ కోర్సుల్లో జాయిన్ కావాలని అనుకున్న వారు తప్పకుండా లా డిగ్రీ చదివి ఉండాలి. దీనికి ఎలాంటి వయోపరిమితి కూడా లేదు.
ఏపీ లాసెట్ పరీక్షను జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం కూడా సీబీటీ విధానంలోనే ఉంటుంది. మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అయితే పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి 30 మార్కులు ఇస్తారు. పార్ట్ బీలో అయితే కరెంట్ ఎఫైర్స్ నుంచి మొత్తం 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి వేస్తారు. ఇలా మొత్తం 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.