Rabies: ఆవు ద్వారా మహిళకు సోకిన రేబిస్.. మరణించిన మహిళ
Rabie సాధారణంగా కుక్క కాటు లేదా లిక్కి వల్ల రేబిస్ వస్తుందని నమ్ముతారు. కానీ రేబిస్ అనేక ఇతర మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.

Rabies: ఎలాంటి వైరస్ లు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయో తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. వాటి వల్ల ఎందరో ఇబ్బంది పడుతూ భయాందోళనతో బతుకుతున్నారు. ఏ వైరస్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో అనే భయమే ప్రస్తుతం ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం రేబిస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఒక వార్త షాకింగ్ గా నిలుస్తుంది. అయితే గ్రేటర్ నోయిడాలో ఒక మహిళ రేబిస్ వ్యాధితో మరణించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ ఆవు పాలు ద్వారా వచ్చిందని తెలుస్తుంది. నివేదికల ప్రకారం, కుక్క కాటు కారణంగా ఆవుకు రేబిస్ సోకింది. ఆ ఆవు పాలు తాగిన తర్వాత ఆ స్త్రీకి కూడా రేబిస్ ఇన్ఫెక్షన్ సోకింది. పాలు తాగిన కొన్ని రోజుల తర్వాత, ఆ మహిళలో రాబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఆమె మరణించింది.
సాధారణంగా కుక్క కాటు లేదా లిక్కి వల్ల రేబిస్ వస్తుందని నమ్ముతారు. కానీ రేబిస్ అనేక ఇతర మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. రేబిస్ వ్యాధి లక్షణాలు, దానిని నివారించడానికి ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రేబిస్ అంటే ఏమిటి?:రేబిస్ అనేది తీవ్రమైన, ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి, ఇది ప్రధానంగా జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి రేబిస్ వైరస్ (లైసావైరస్) వల్ల వస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రేబిస్ వ్యాధి ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు కాటు లేదా గీరిన సరే వ్యాపిస్తుంది. సకాలంలో టీకా వేయకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది.
రేబిస్ లక్షణాలు: రేబిస్ లక్షణాలు సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత 1 నుంచి 3 నెలల తర్వాత కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి కొన్ని రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఆలస్యం కావచ్చు.
జ్వరం, తలనొప్పి, అలసట, బలహీనత, కండరాల నొప్పి, కాటు వేసిన ప్రదేశంలో దురద, నొప్పి లేదా తిమ్మిరి, అశాంతి, భయము, గందరగోళం లేదా మానసిక అసమతుల్యత, అధిక లాలాజలం, మింగడంలో ఇబ్బంది, కండరాల తిమ్మిరి
పక్షవాతం, కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రాబిస్ నివారణ
కుక్కలు, పిల్లులు వంటి మీ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్ టీకాలు వేయించుకోండి. రాబిస్ వ్యాప్తిని నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. అడవి జంతువుల నుండి దూరంగా ఉంచండి. ముఖ్యంగా అసాధారణంగా ప్రవర్తించే వాటి నుంచి దూరం ముఖ్యంగా మెయింటెన్ చేయాలి. రాబిస్ సోకిన జంతువులు తరచుగా దూకుడుగా లేదా వింతగా ప్రవర్తిస్తాయి. కాటుకు గురైనప్పుడు వెంటనే చర్య తీసుకోండి. ఏదైనా జంతువు కాటుకు గురైతే, వెంటనే గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాలు కడగాలి. దీని తరువాత, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.