Madhya Pradesh: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

Madhya Pradesh
Madhya Pradesh: ప్రేమగా పెంచుకున్న కూతురు.. ఎదిగిన తర్వాత కాదంటే అది ఆ తల్లిదండ్రులకు నరకం తో సమానం. అయితే ఇప్పుడు మీరు చదువపోయే కథనంలో ఓ కూతురు చేసిన నిర్వాకం ఆ తండ్రిలో పట్టరాని ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో అతడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
ప్రేమగా పెంచుకున్న కూతురు.. ప్రేమ పేరు చెప్పి ప్రియుడితో వెళ్లిపోయింది. వద్దని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా అతడిని వివాహం చేస్తుంది. దీంతో ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయాడు. ఇన్నాళ్లపాటు ప్రేమగా పెంచుకున్న కూతురు అలా వెళ్ళిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఇరుగుపొరుగు వాళ్ళు సూటిపోటి మాటలు అంటుంటే భరించలేకపోయాడు. దీంతో అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు బతికే ఉండగానే.. బంధువులను, చుట్టుపక్కల వారిని పిలిపించాడు. ఆమె బతికి ఉండగానే శార్ద ఖర్మలు నిర్వహించాడు. తన కూతురు చనిపోయిందని.. ఊరు మొత్తం పోస్టర్లు వంటించాడు.. తనకు, కుటుంబ సభ్యులకు గుండ్లు చేయించాడు. ఊరు మొత్తం శాంతి భోజనాలు పెట్టించాడు.. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖచ్రోడ్ ప్రాంతంలోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది.
Maha nandi: ప్రముఖ శివ క్షేత్రం మహానందిలో విషాదం.. ఇద్దరు మృతి
అసలేం జరిగిందంటే..
ఖచ్రోడ్ తాలూకా పరిధిలోని గుదావన్ గ్రామానికి చెందిన వర్ధిరామ్ గర్గమ అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి మేఘ గర్గమ అనే కూతురు ఉంది. ఆమెను అతడు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. నచ్చిన చదువులు చదివించాడు. తన స్తోమతకు మించినప్పటికీ ఆమెకు అత్యున్నత విద్యాసంస్థల్లో చదువు చెప్పించాడు. అయితే మేఘ కొద్దిరోజుల క్రితం దీపక్ అనే యువకుడితో ప్రేమలో పడింది.
ఈ విషయం తెలిసి వర్ధిరామ్ కూతురు మేఘను నిలదీశాడు. అలాంటి వ్యవహారాలు తప్పని వారించాడు. పైగా అతడు నీకు సరిపోడని స్పష్టం చేశాడు. అయినప్పటికీ మేఘ పట్టించుకోలేదు. పైగా దీపక్ తో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో మేఘ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు గాలించి మేఘ, దీపక్ ను పట్టుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని మేఘ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వర్ధిరామ్ ను మేఘ గుర్తించలేదు. దీనికి తోడు తనకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.. దీంతో వర్ధిరామ్, అతని భార్య అక్కడే కుప్ప కూలిపోయారు. అక్కడే గుండెలు పగిలే విధంగా నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మేఘ పేరు మీద సంతాప కార్డులను ముద్రించారు. ఊరు మొత్తం పంచిపెట్టారు.
తమ ఆచారాల ప్రకారం కర్మకాండలు నిర్వహించారు.. ఆ తర్వాత ఊరు మొత్తానికి విందు ఇచ్చారు..” నేటి కాలంలో తల్లిదండ్రులకు పిల్లలు విలువ ఇవ్వడం లేదు. వయసు వేడిలో కలిగే భావోద్వేగాలను ప్రేమ అనుకుంటున్నారు. కనిపించిన తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారు. అందువల్లే నాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. అందువల్లే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దీనిని చూసైనా నేటి కాలం యువత మారాలని కోరుకుంటున్నారని” వర్దిరామ్ తన కూతురు సంతాప కార్డులో పేర్కొన్నాడు.