SBI: బ్యాంకు ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త.. ఇలా చేస్తే మీ డబ్బులు గోవిందా

SBI:
బ్యాంకు అకౌంట్లు అనేవి అందరికీ ఉంటాయి. అయితే అన్ని బ్యాంకుల్లో అకౌంట్ కంటే ఎస్‌బీఐలో అకౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకు అయితే సేఫ్‌గా ఉంటుందని ఆలోచించి చాలా మంది ఇందులో అకౌంట్‌ను ఓపెన్ చేస్తారు. అయితే ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. అసలు వారి ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడంతో అకౌంట్ దారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. కారణం లేకుండా ఎవరి అకౌంట్ నుంచి అయినా డబ్బులు కట్ అయితే కొందరు ఏంటి.. అందరూ కూడా టెన్షన్ పడటం సర్వ సాధారణమే. అసలు ఖాతాదారులకు తెలియకుండా డబ్బులు ఎందుకు కట్ అవుతాయి? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఎస్‌బీఐ ఖాతాదారులకు వారి ప్రమేయం, ఎలాంటి సమాచారం లేకుండా అకౌంట్ నుంచి రూ.236 కట్ అయ్యాయి. అయితే ఇదే కేవలం ఒకరికి మాత్రమే కాకుండా చాలా మందికి కూడా జరిగింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎస్‌బీఐ ఈ సందర్భంగా డబ్బులు కట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్‌బీఐ ఏటీఎమ్ కార్డుల రుసుములను కట్ చేస్తోంది. ఎస్‌బీఐ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ వంటి కార్డులు ఎవరికైతే ఉంటాయో వారికి వార్షిక రుసుము కింద రూ.200 కట్ చేస్తోంది. అయితే దీనికి ట్యాక్స్ కలిపి మొత్తం రూ.236 ఛార్జ్ చేస్తోంది. వీటిపై 18 శాతం వరకు జీఎస్టీ వసూలు చేస్తోంది. అయితే కొందరు అకౌంట్‌ను వాడకుండా అలా వదిలేస్తారు.
సరైన డబ్బులు ఖాతాలో ఉండవు. అలాంటి వారి అకౌంట్‌కి అయితే మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. క్లాసిక్, సిల్వర్ గ్లోబల్ కార్డులకు రూ.236, కట్ కాగా.. యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ కోసం రూ.250 కట్ చేయడంతో పాటు జీఎస్‌టీ కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ఇక ప్లాటినం కార్డులకు రూ.350తో పాటు జీఎస్‌టీని కట్ చేస్తున్నారు. అలాగే ప్రైడ్, ప్రీమియం కార్డులపై ఎస్‌బీఐ రూ.425ను కట్ చేస్తోంది. అయితే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కొందరికి మెసేజ్‌లు వచ్చాయి. కానీ మరికొందరికి మెసేజ్‌లు రాలేదు. అలాగే డైలీ లిమిట్‌ను కూడా పెట్టింది. రోజుకి గరిష్టంగా యూజర్లు 10 లావాదేవీలు మాత్రమే చేసుకోవాలి. అయితే గరిష్టంగా కేవలం రూ.లక్ష వరకు మాత్రమే చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. వీటిని ఎస్‌బీఐ యోనో యాప్‌తో ట్రాన్సాక్షన్ చేయవచ్చు.