Betting App: బెట్టింగ్ ప్రమోషన్స్ ఎఫెక్ట్.. భయపడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు

Betting App
ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌పై ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంతో మొత్తం 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.
వీరిలో కొందరిని పంజాగుట్ట పోలీసులు విచారణకు కూడా పిలిచారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తు్న్నారని, పోలీసులు వీరిపై యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ కేసు కేవలం పోలీసుల చేతిలో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ కేసు ఈడీ చేతిలోకి వెళ్లింది.
ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ లాండరింగ్ కూడా అధికంగా జరిగినట్లు ఈడీ గుర్తించింది. డబ్బులు వస్తాయని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్సర్ల మెడకి చుట్టుకుంది. చిన్న స్థాయి సెలబ్రిటీలపై పోలీసులు పంజా విసురుతున్నారు. ఎవరెవరు అయితే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారో వారిపై పోలీసులు అరెస్టు చేస్తామంటున్నారు. ఈ యాప్స్ ప్రమోషన్ వల్ల ఎవరైనా చనిపోయారని తేలితే మాత్రం తప్పకుండా వారికి పది ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also Read : Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి పేరుతో మరో మోసం.. కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ అనేది పెద్ద వ్యాపారం. ఈ యాప్స్ వల్ల కొన్ని కోట్ల డబ్బు మనీలాండరింగ్ అవుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ను ఎవరు తీసుకువస్తున్నారు? ఇవి ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎలా మోసం చేస్తున్నారనే విషయాలు సరిగ్గా తెలియవు. ఒక్కసారి బెట్టింగ్ యాప్స్ మోజులో పడితే ఆస్తులు అయినా ఖాళీ అవుతాయి. లేకపోతే మనిషి అయినా చనిపోతాడు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. అయినా కూడా పెద్ద వాళ్లను పట్టుకోకుండా చిన్న సెలబ్రిటీలపై కేసులు పెడుతున్నారు. కేవలం వీరే కాకుండా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
చివరకు సినిమా హీరోయిన్లు కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. పోలీసులు విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజ, సుప్రీత, రీతూ చౌదరి ఇలా మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. అయితే వీరితో పాటు ఇంకా చాలా మంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వీరిని తప్పు అని కేసు వేయడం కంటే బెట్టింగ్ యాప్స్ వేసే వారిని పట్టుకుంటే అవుతుందని పలువురు అంటున్నారు. మరికొందరు వీరిపై కేసు వేయడం కరెక్ట్. వీరిని చూసి ఇతరులు అయినా కూడా బుద్ధి వస్తుందని అంటున్నారు.